iDreamPost
android-app
ios-app

IPL ముందు SRHకి భారీ షాక్! ఆ స్టార్ పూర్తిగా దూరం!

  • Published Mar 02, 2024 | 6:08 PM Updated Updated Mar 02, 2024 | 6:08 PM

Dale Steyn, IPL 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ముందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ సారి కప్పు కొట్టాలని ఆశపడుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌కు ఈ నిర్ణయం గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.

Dale Steyn, IPL 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ముందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ సారి కప్పు కొట్టాలని ఆశపడుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌కు ఈ నిర్ణయం గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.

  • Published Mar 02, 2024 | 6:08 PMUpdated Mar 02, 2024 | 6:08 PM
IPL ముందు SRHకి భారీ షాక్! ఆ స్టార్ పూర్తిగా దూరం!

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇదే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తొలుత ఓ 21 మ్యాచ్‌లకు బీసీసీఐ షెడ్యూల్‌ రిలీజ్‌ చేసింది. మిగిలిన షెడ్యూల్‌ను.. పార్లమెంట్‌ ఎన్నికల షడ్యూల్‌ వెలువడిన తర్వాత.. దానికి అనుగుణంగా మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ఆరంభానికి ముందే.. మన హోం టీమ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఈ సారి సీజన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు కూడా ఇది గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ మంచి టీమ్‌తో బరిలోకి దిగుతుందని, ఈ సారి కప్పు కొట్టే అవకాశం ఉందని అభిమానులంతా ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ, వారి నమ్మకాన్ని కాస్త కంగారు పెట్టేలా.. జట్టు బౌలింగ్‌ కోచ్‌ డేల్‌ స్టెయిన్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌కి దూరంగా ఉంటున్నాడని సమాచారం. స్టెయిన్‌ లాంటి అనుభవజ్ఞుడైన దిగ్గజ క్రికెటర్‌ సలహాలు, సూచనలు ఆ జట్టుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఉమ్రాన్‌ మాలిక్‌ లాంటి యువ స్పీడ్‌ గన్స్‌ను మరింత సానబెట్టేందుకు స్టెయిన్‌ మించిన కోచ్‌ ఇంకొకరు దొరకడు. అలాంటి కోచ్‌ ఇప్పుడు మొత్తం సీజన్‌కు దూరం అవుతుండటం ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు ఆ జట్టు అభిమానులను సైతం కలవరపెడుతోంది.

ఒక వేళ స్టెయిన్‌ నిజంగానే ఈ ఐపీఎల్‌ సీజన్‌కు దూరమైతే.. అతని స్థానంలో కొత్త బౌలింగ్‌ కోచ్‌ను నియమించాల్సి ఉంటుంది ఎస్‌ఆర్‌హెచ్‌. అందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌కు కొత్త బౌలింగ్‌ కోచ్‌గా ఎవరొస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌కో మార్కరమ్‌ స్థానంలో కొత్త కెప్టెన్‌ను కూడా నియమించేందుకు సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా వేలంలో భారీ ధర పెట్టి కొనుగోలు చేసి ఆసీస్‌ వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ను తన టీమ్‌కు కెప్టెన్‌గా చేసే ఆలోచనలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఉన్నట్లు సమాచారం. కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ.. నేడో రేపో నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి స్టెయిన్‌ ఈ ఐపీఎల్‌కు దూరం అవుతుండటం, అలాగే కమిన్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా నియమిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.