iDreamPost

ఈ 5 మంత్రాలు రోజు చదివితే.. లైఫ్ లో ఎలాంటి ఒత్తిడి ఉండదు!

  • Published Mar 28, 2024 | 6:13 PMUpdated Mar 28, 2024 | 6:13 PM

ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరు పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు.. ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోవడమే కాకుండా.. ప్రపంచంతో, కాలంతో పొరాడుతూ అలసిపోతారు. మరి ఇలా అలసిపోవడం వలన అధిక ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవ్వడం అనేది సర్వ సాధారణాం అయిపోయింది. అయితే తరుచు పనులతో, చదువులతో అలసిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి వారు ఈ ఆద్భుతమైన మంత్రాలను జపిస్తే అవన్నీ తొలగిపోతాయి.

ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరు పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు.. ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోవడమే కాకుండా.. ప్రపంచంతో, కాలంతో పొరాడుతూ అలసిపోతారు. మరి ఇలా అలసిపోవడం వలన అధిక ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవ్వడం అనేది సర్వ సాధారణాం అయిపోయింది. అయితే తరుచు పనులతో, చదువులతో అలసిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి వారు ఈ ఆద్భుతమైన మంత్రాలను జపిస్తే అవన్నీ తొలగిపోతాయి.

  • Published Mar 28, 2024 | 6:13 PMUpdated Mar 28, 2024 | 6:13 PM
ఈ 5 మంత్రాలు రోజు చదివితే.. లైఫ్ లో ఎలాంటి ఒత్తిడి ఉండదు!

ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరు ఉరుకులు పరుగులతో బిజీ లైఫ్ ను కొనసాగిస్తున్నారు. ఇలా నిత్యం కోట్లాదిమంది ప్రజలు పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు.. ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోవడమే కాకుండా.. ప్రపంచంతో, కాలంతో పొరాడుతూ అలసిపోతారు. మరి ఇలా అలసిపోవడం వలన అధిక ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవ్వడం అనేది సర్వ సాధారణం అయిపోయింది. అయితే ఇలా ఒత్తిడి గురయ్యిన వారిలో పనిచేసే ఉద్యోగస్తులు మాత్రమే ఉంటారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ ఒత్తిడికి గురయ్యిన వారిలో విద్యార్థులు, ఇంట్లో పనిచేసే మహిళలు కూడా ఉన్నారు. కాగా, తరుచు పనులతో, చదువులతో అలసిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని చాలామంది కోరుకుంటున్నారు. మరి అలా ప్రశాంతమైన వాతవరణం కోరుకుని ఒత్తిడి తగ్గించుకోవాలని అనుకునే వారికి ఈ ఆద్భుతమైన మంత్రాలు ఎంతగానో సహాయపడతాయి. మరి అవి ఏంటో తెలుసుకుందాం.

ప్రతిరోజు ప్రశాంత వాతవరణం కావాలని కోరుకునే వారు వారు.. రోజూ ఉదయాన్నే లేచాక కొన్ని మంత్రాలు జపించడం వలన ఒత్తిడి, ఆందోళన తగ్గి జీవితం సాఫీగా సాగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మరి అలాంటి ఆద్భుతమైన ఈ మంత్రలను పండితులు మనకు తెలిపారు. మరి ఆ మంత్రాలు ఏంటో తెలుసుకుందాం.

ఓం

ఓంకారం అనేది చాలా ప్రశాంతమైనది, ప్రభావితమైనది. ఈ ఓం మంత్రం వల్ల మనసు ఇతరు విషయాలపై దృష్టి పెట్టకుండా శరీరం పైనే దృష్టి పెట్టేందుకు కేంద్రీకరిస్తుంది. అలాగే ఓంకారం జపించడం వలన మెదడుకి, మనసుకి, గొప్ప శక్తి లభిస్తుంది. అంతేకాకుండా.. నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. దీనిని వలన మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. అలాగే ఈ ఓం జపించడం వలన ఒత్తిడి, ఆందోళన చంచలత్వం తగ్గుతాయి. దీంతోపాటు నాడీ వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. అందుచేత క్రమం తప్పకుండా ఓం జపించడం వలన స్వీయ అవగాహన, స్వీయ అంగీకారం, ఆధ్యాత్మిక వృద్ధి పెరుగుతుంది. ఇక ధ్యాన స్థితిని ప్రేరేపిస్తుంది.

మహా మృత్యుంజయ మంత్రం

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్దనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

శివునికి చెందినది మహామృత్యుంజయ మంత్రం. ఇది అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి. అజ్ఞానం, ప్రతికూల ఆలోచనలతో ఉన్న భక్తులు ప్రతిరోజూ ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. ఎందుకంటే.. దేవుడు ఆ అజ్ఞానాన్ని నాశనం చేస్తాడని అంటారు. ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీరు రోజువారి జీవితంలో ఉండే భయాలు, ఒత్తిడి, ఆందోళన వంటివి తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని జపించే వారిలో దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే హృదయంలో దైవం నిండుకుంటుందో.. అప్పుడు ఆందోళన, భయం వంటివి తొలగిపోతాయి.

గాయత్రీ మంత్రం
ఓం భూర్భువస్సువ: తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియోయోన: ప్రచోదయాత్’

భారత దేశంలోని ఎన్నో పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం పూట ఈ గాయత్రీ మంత్రాన్ని పిల్లల చేత జపించేలా చేస్తారు. అలాగే సంస్కృత భాషా తరగతుల్లో కూడా ఈ గాయత్రి మంత్రాన్ని కచ్చితంగా జపిస్తారు. ఎందుకంటే.. ఈ గాయత్రీ మంత్రానికి దైవిక శక్తి ఎక్కువ. అలాగే గాయత్రీ మంత్రం అనేది ‘ఓం’ తో మొదలవుతుంది. కనుక దీనిని ప్రతిరోజూ పఠించడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. దీనితో పాటు భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. క్రమంగా తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఇక ఈ గాయత్రి మంత్రాన్ని జపించే వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పైగా అంతర్గత శక్తిని అభివృద్ధి చేస్తుంది.

హనుమాన్ చాలీసా

సాధారణంగా హనుమాన్ చాలీసాను ఎక్కువమంది మంగళవారం పూట మాత్రమే చదువుతారు. అయితే నిజానికి ఇది ప్రతిరోజూ చదవాల్సిందే. ఎందుకంటే.. ఈ హనుమాన్ చాలీసా చదివే వారిలో భక్తితో పాటు ధైర్యం, బలం కూడా పెరుగుతుంది. అలాగే హనుమంతుడు భూమికి అత్యంత దగ్గరగా ఉంటాడని నమ్ముతారు. కనుక హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఆపద సమయంలో రక్షణ దొరుకుతుందని మార్గదర్శకత్వం లభిస్తుందని ఎంతోమంది నమ్మకం. అంతేకాకుండా.. ఈ హనుమాన్ చాలీసా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. కాగా, ఎలాంటి ఒత్తిడి, భయాలు లేకుండా ధైర్యన్ని నింపుతుంది.

ఓం నమశ్శివాయ

పరమ శివునికి అంకితం చేసిన మరో శక్తివంతమైన మంత్రంలో ఓం నమశ్శివాయ ఒకటి. అయితే దీని అర్థం ‘నేను శివునికి, అతని శక్తికి నమస్కరిస్తున్నాను’ అని చెబుతారు. కనుక దీన్ని రోజు జపించడం వల్ల భయాలు, ఒత్తిడి, ఆందోళన వంటివి తొలగిపోతాయి. అలాగే ఈ మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో హృదయంతో జపించాలి. ఒకసారి రెండుసార్లు కాదు ఎక్కువసార్లు జపించడం వల్ల ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు. అలాగే లోతైన ధ్యాన స్థితిలో ఓం నమశివాయ పఠించినప్పుడు ఆ మంత్రంలో నిక్షిప్తమైన శక్తి, మనసును శుద్ధి చేస్తుంది. దీనితో పాటు ఒత్తిడిని ప్రేరేపితం చేసే లక్షణాలను తగ్గిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి