iDreamPost

నిన్న మ్యాచ్‌లో కమిన్స్ చేసిన అద్భుతం గమనించారా? ఇక్కడే మ్యాచ్ టర్న్ అయ్యింది!

  • Published May 25, 2024 | 12:21 PMUpdated May 25, 2024 | 12:21 PM

Cummins, Qualifier 2, SRH vs RR: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్‌ 2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించింది. అయితే.. ఈ విజయంలో కమిన్స్‌ చేసిన ఒక పని మ్యాచ్‌కు టర్నింగ్‌పాయింట్‌గా నిలిచింది. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

Cummins, Qualifier 2, SRH vs RR: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్‌ 2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించింది. అయితే.. ఈ విజయంలో కమిన్స్‌ చేసిన ఒక పని మ్యాచ్‌కు టర్నింగ్‌పాయింట్‌గా నిలిచింది. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

  • Published May 25, 2024 | 12:21 PMUpdated May 25, 2024 | 12:21 PM
నిన్న మ్యాచ్‌లో కమిన్స్ చేసిన అద్భుతం గమనించారా? ఇక్కడే మ్యాచ్ టర్న్ అయ్యింది!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి క్వాలిఫైయర్‌లో కేకేఆర్‌ చేతిలో ఓటమి పాలైనా.. తిరిగి పుంజుకుని క్వాలిఫైయర్‌-2లో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసి.. ఫైనల్‌ పోరుకు సిద్దమైంది. అయితే.. ఎంతో కీలకమైన క్వాలిఫైయర్‌-2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రధాన కారణం కెప్టెన్‌ కమిన్స్‌ తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయమనే చెప్పాలి. అదే ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించి.. ఫైనల్‌కు పంపింది. సరైన టైమ్‌కి స్పందించి.. కమిన్స్‌ కనుక ఆ పని చేయకపోయి ఉంటే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ గెలిచేది కాదేమో అని క్రికెట్‌ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఆ మ్యాచ్‌ టర్నింగ్‌ నిర్ణయం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ మ్యాచ్‌ జరిగిన విధానం చూస్తే.. చాలా మందికి ఒక డౌట్‌ రావొచ్చు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అంత కష్టమైనప్పుడు టాస్‌ గెలిచిన ఆర్‌ఆర్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ ఎందుకు తొలుత బౌలింగ్‌ తీసుకున్నాడు అని. అయితే.. తొలుత అంచనా ప్రకారం రెండో ఇన్నింగ్స్‌ సమయానికి డ్యూ వచ్చి బ్యాటింగ్‌ ఈజీ అవుతుందని అంతా భావించారు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉన్నా.. డ్యూ(తేమ) కారణంగా బాల్‌ జారిపోతూ.. సరైన పట్టు దొరక్క బౌలర్లు ఇబ్బంది పడతారని భావించి శాంసన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఒక వేళ ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ కమిన్స్‌ టాస్‌ గెలిచినా ఇదే పని చేసేవాడేమో. అదృష్టం కొద్ది కమిన్స్‌ టాస్‌ గెలవకపోవడమే మంచిదైంది.

176 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ పవర్‌ ప్లేలో ఒక వికెట్‌ నష్టానికి 51 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై తొలి 7 ఓవర్లు పేసర్లతోనే వేయించాడు కమిన్స్‌. 8వ ఓవర్‌లో స్పిన్నర్‌ షాబాజ్‌ అహ్మాద్‌ను ఎటాక్‌లోకి దింపాడు. ఆ ఓవర్‌లో షాబాజ్‌ 10 రన్స్‌ ఇచ్చినా.. ఒక వికెట్‌ తీశాడు. పైగా పిచ్‌ను స్పిన్నర్లకు మద్దతు లభిస్తుందని పసిగట్టిన కమిన్స్‌ వెంటనే తన ప్లాన్‌ను మార్చేసుకున్నాడు. పైగా డ్యూ కూడా రాకపోవడంతో.. వరుస బెట్టి స్పిన్నర్లతోనే వేయించాడు. షాబాజ్‌ అహ్మాద్‌, అభిషేక్‌ శర్మ, ఎడెన్‌ మార్కరమ్‌తో ఏకంగా 9 ఓవర్లు ఏకధాటిగా బౌలింగ్‌ చేయించాడు. ఇక్కడే ఆర్‌ఆర్‌ దారుణంగా దెబ్బతింది. స్పిన్‌ సరిగ్గా ఎదుర్కొలేక ఆ జట్టు చతికిల పడింది. మిడిల్‌ ఓవర్స్‌ మొత్తం స్పిన్నర్లతో బౌలింగ్‌ చేయించాలన్న కమిన్స్‌ ప్లాన్‌ సూపర్‌ వర్క్‌ అవుట్‌ అయి.. ఎస్‌ఆర్‌హెచ్‌కు విజయం అందించింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి