iDreamPost

ఈ ఫొటోలోని పిల్లాడ్ని గుర్తుపట్టారా? ఫస్ట్ మ్యాచ్​లోనే రషీద్​ ఖాన్​కు చుక్కలు చూపించాడు!

  • Published Mar 27, 2024 | 6:55 PMUpdated Mar 27, 2024 | 6:55 PM

క్రికెటర్ల చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఓ సీఎస్​కే ఆటగాడి ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇతను ఆడిన మొదటి మ్యాచ్​లోనే స్టార్ బౌలర్ రషీద్​ ఖాన్​కు చుక్కలు చూపించాడు.

క్రికెటర్ల చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఓ సీఎస్​కే ఆటగాడి ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇతను ఆడిన మొదటి మ్యాచ్​లోనే స్టార్ బౌలర్ రషీద్​ ఖాన్​కు చుక్కలు చూపించాడు.

  • Published Mar 27, 2024 | 6:55 PMUpdated Mar 27, 2024 | 6:55 PM
ఈ ఫొటోలోని పిల్లాడ్ని గుర్తుపట్టారా? ఫస్ట్ మ్యాచ్​లోనే రషీద్​ ఖాన్​కు చుక్కలు చూపించాడు!

మూవీ, స్పోర్ట్ స్టార్స్​కు మన దేశంలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా క్రికెటర్లకు ఉండే అభిమాణ గణం గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రికెటర్లను డెమీ గాడ్స్​గా చూస్తుంటారు. వాళ్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని భావిస్తుంటారు. అందుకే ఆటగాళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా చక్కర్లు కొడుతుంటాయి. వాళ్ల చిన్నప్పటి ఫొటోలు కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ యంగ్ క్రికెటర్ ఫొటో ఒకటి ఇలాగే నెట్టింట హల్​చల్​ చేస్తోంది. అతడు ఒక్క మ్యాచ్​తోనే అందరి ఫోకస్​ను తన వైపునకు తిప్పుకున్నాడు. ఐపీఎల్​లో ఆడిన ఫస్ట్ మ్యాచ్​లోనే రషీద్ ఖాన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్​కు చుక్కలు చూపించాడు.

టీమిండియా లెజెండ్ సురేష్ రైనాతో కలసి ఫొటోకు ఫోజులు ఇచ్చిన ఈ పిల్లాడ్ని గుర్తుపట్టే ఉంటారు. ఈసారి ఐపీఎల్​లో బాగా మార్మోగుతున్న పేర్లలో అతడిది ఒకటి. గుజరాత్ టైటాన్స్​తో మ్యాచ్​లో రషీద్ ఖాన్​ తుక్కు రేగ్గొట్టాడతను. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. యంగ్ బ్యాటర్ సమీర్ రిజ్వీ. జీటీతో మ్యాచ్​లో 6 బంతులు ఎదుర్కొన్న రిజ్వీ.. 14 పరుగులు చేశాడు. ఇందులో 2 భారీ సిక్సులు ఉన్నాయి. ఈ రెండూ కూడా రషీద్ బౌలింగ్​లో బాదినవే. రషీద్ వేసిన తొలి బంతినే బిగ్ సిక్స్​గా మలిచాడు రిజ్వీ. ఎదురుగా ఉన్నది స్టార్ బౌలర్, వికెట్ టేకర్ అని భయపడలేదతను. క్లీన్ హిట్టింగ్​తో చెలరేగిపోయాడు. బిగ్ షాట్స్ కొట్టగలనని, టీమిండియాకు భవిష్యత్తులో ప్రాతినిధ్యం వహించే సత్తా తనకు ఉందని అతడు సిగ్నల్స్ పంపాడు.

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లోనూ సీఎస్​కే తరఫున బరిలోకి దిగాడు రిజ్వీ. అయితే ఆ మ్యాచ్​లో అతడికి బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. కానీ గుజరాత్​తో మ్యాచ్​లో అవకాశం రావడంతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఒక్క ఇన్నింగ్స్​తో మంచి క్రేజ్ సంపాదించాడు. అలాంటోడి చిన్నప్పటి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో రైనా టీమిండియా జెర్సీతో కనిపించాడు. అతడి పక్కనే కళ్లద్దాలు పెట్టుకొని, చేతిలో బాల్​తో నవ్వుతూ పోజులు ఇచ్చాడు రిజ్వీ. ఈ ఫొటోను చూసిన నెటిజన్స్.. కష్టపడితే ఎవ్వరైనా తమ కలల్ని నిజం చేసుకోవచ్చని చెప్పడానికి రిజ్వీనే ఉదాహరణ అని అంటున్నారు. సీఎస్​కే మాజీ ఆటగాడైన రైనాతో ఫొటో దిగాడని.. ఇప్పుడు అదే టీమ్ తరఫున ఆడుతుండటం గొప్ప విషమని చెబుతున్నారు. మరి.. గుజరాత్​తో మ్యాచ్​లో రిజ్వీ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPLలో బ్యాటర్లను భయపెట్టిస్తున్న రూల్.. మ్యాచ్ స్వరూపమే మారిపోతోంది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి