SNP
Glenn Maxwell, CSK vs RCB, IPL 2024: ఆర్సీబీ వర్సెస్ సీఎస్‌కే ఇదే మ్యాచ్ గురించి ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చ. కానీ, సీఎస్‌కే మాత్రం ఆర్సీబీలోని ఓ పిచ్చోడికి భయపడుతుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Glenn Maxwell, CSK vs RCB, IPL 2024: ఆర్సీబీ వర్సెస్ సీఎస్‌కే ఇదే మ్యాచ్ గురించి ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చ. కానీ, సీఎస్‌కే మాత్రం ఆర్సీబీలోని ఓ పిచ్చోడికి భయపడుతుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సీఎస్‌కే. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ లోకం వేయిటింగ్. ఐపీఎల్ 2024 సీజన్‌కు ఇదో అనధికారిక నాకౌట్ మ్యాచ్‌లా మారింది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ కావడంతో ఆర్సీబీ, సీఎస్‌కే జట్లు ఎలాగైనా గెలవాలని కసితో బరిలోకి దిగుతున్నాయి. ధోని-కోహ్లీ మధ్య పోటీ కావడంతో క్రికెట్ అభిమానుల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే.. ఈ మ్యాచ్ విషయమై.. ఆర్సీబీలో ఉన్న పిచ్చోడికి సీఎస్‌కే భయపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ పిచ్చోడు ఎవరు? ఎందుకు సీఎస్‌కే అంతా భయపడుతుందో ఇప్పుడు చూద్దాం..
తొలి 8 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఏకంగా 7 మ్యాచ్‌లు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ 8 మ్యాచ్‌ల్లో చాలా ప్రయోగాలు చేసింది. టీమ్‌లో చాలా మంది ఆటగాళ్లను మార్చింది. చాలా మంది స్టార్ ఆటగాళ్లను పక్కనపెట్టింది. కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ తప్ప.. మిగతా అందరు ఆటగాళ్లు టీమ్‌లోకి వస్తూ పోతూ వచ్చారు. 9వ మ్యాచ్ నుంచి ఆర్సీబీ టీమ్ సెట్ అయింది. వరుసగా 5 మ్యాచ్‌ల్లో గెలిచింది. మ్యాక్స్‌వెల్ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన విల్ జాక్స్ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మ్యాక్స్‌వెల్‌ను పూర్తిగా డగౌట్‌కే పరిమితం చేశాడు. కానీ, ఇంగ్లండ్ తరఫున ఆడేందుకు జాక్స్ స్వదేశానికి వెళ్లిపోయాడు. దీంతో.. మ్యాక్స్‌వెల్ రంగంలోకి దిగక తప్పని పరిస్థితి వచ్చింది.
ఇదే సీఎస్‌కే భయానికి కారణం అవుతోంది. ఈ సీజన్‌లో పెద్దగా ఫామ్‌లో లేని మ్యాక్స్‌వెల్ టీమ్‌లోకి వస్తుంటే.. సీఎస్‌కే ఎందుకు భయపడుతుందని మీరు అనుకోవచ్చు. కానీ, ఎంత ఫామ్‌లో లేకపోయినా.. మ్యాక్సీని తక్కువ అంచనా వేయకూడదు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల మ్యాచ్ విన్నర్ అతను. వన్డే వరల్డ్ కప్ 2023లో ఆఫ్ఘనిస్థాన్‌పై మ్యాక్స్‌వెల్ ఆడిన ఇన్నింగ్స్ తల్చుకుంటే.. ఇప్పటికీ చాలా మంది క్రికెట్ అభిమానుల గుండెలు అదరుతాయి. ఒక మృగంలా ఆ రోజు ఆఫ్ఘాన్‌పై పడి డబుల్ సెంచరీ చేసి ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను గెలిపించాడు. పైగా నాకౌట్ లాంటి మ్యాచ్‌ల్లో మ్యాక్స్‌వెల్ ఆట పూర్తి డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే సీఎస్‌కేకి మ్యాక్స్‌వెల్ భయం పట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆ క్రికెట్ పిచ్చోడు తమను ఎక్కడ ప్లే ఆఫ్స్‌కు దూరం చేస్తాడేమో అని ఎల్లో జెర్సీలు వణికిపోతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
RCB Fans to Glenn Maxwell pic.twitter.com/35S1xBFp89
— RVCJ Media (@RVCJ_FB) May 15, 2024