iDreamPost

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని.. భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని ఆరాటపడుతుంటారు తల్లిదండ్రులు. అందుకే తమ కడుపును మాడ్చుకుని పిల్లలకు ఇష్టమైన చదువులు చదివిస్తుంటారు. అందు కోసం దూర భారాలు వెళుతున్నా.. పిల్లలకు అడ్డుచెప్పడం లేదు. కానీ చదువుకోవాల్సిన పిల్లలు.. తల్లిదండ్రుల కడుపుకు కోత పెడుతూ.. అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. కూతురుకి మంచి కాలేజీలో సీటు వచ్చిందని ఆశపడ్డారు తల్లిదండ్రులు. దూరమైన కాదనలేదు. కుమార్తె ఇష్టపడ్డ కాలేజీలో బీటెక్ జాయిన్ చేశారు. కానీ ఊహించని విధంగా కుమార్తె ఆత్మహత్య చేసుకుని పుత్రికా శోకాన్ని మిగిల్చింది. ఆత్మహత్య చేసుకుంటూ తన చావుకు కారణం ఏంటో రాసి పెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

విశాఖ పట్నంలోని త్రినాథపురానికి చెందిన గురివల్లి జయశ్రీ(19)  బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంది. గైట్ కాలేజీలో చదువుతున్న జయశ్రీ.. తన స్నేహితులతో కలిసి దివాన్ చెరువులోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్య సమస్యలతోనే తనువు చాలిస్తున్నట్లు సూసైడ్ లేఖలో పేర్కొంది. . ఇటీవల అనారోగ్య సమస్యలు రావడంతో ఆసుపత్రిలో చూపించుకుని తిరిగి తన రూంకు వచ్చేసింది. గత వారం రోజుల నుండి కాలేజీకి కూడా సరిగా హాజరు కావడం లేదు. బుధవారం స్నేహితులు కాలేజీకి వెళ్లిపోయిన తర్వాత.. ఇంట్లో చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది.

చనిపోయే సమయంలో తన తమ్ముడిని ఉద్దేశించి ఆత్మహత్య లేఖ రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. అమ్మ మన కోసం చాలా కష్టపడుతుండటం చూడలేకపోతున్నా. నా ఆరోగ్యం కూడా బాగోవడం లేదు. నువ్వు బాగా చదువుకుని అమ్మను చూసుకోవాలని అని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. కాలేజీకి వెళ్లి తిరిగి వచ్చిన స్నేహితులు గదిలో జయశ్రీ ఉరికి వేలాడుతుండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి