iDreamPost
android-app
ios-app

మహిళలే అతడి టార్గెట్.. కూలీ పనులకు పిలిచి..

కూలినాలి చేసుకుని బతికే మహిళలే అతడి టార్గెట్. ఉపాధి పనులకు వచ్చిన మహిళలను అతడు ట్రాప్ చేస్తాడు. తనతో వస్తే పని కల్పిస్తానని చెప్పి మహిళల్ని ఆటోలో తీసుకెళతాడు. అనంతరం నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి..

కూలినాలి చేసుకుని బతికే మహిళలే అతడి టార్గెట్. ఉపాధి పనులకు వచ్చిన మహిళలను అతడు ట్రాప్ చేస్తాడు. తనతో వస్తే పని కల్పిస్తానని చెప్పి మహిళల్ని ఆటోలో తీసుకెళతాడు. అనంతరం నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి..

మహిళలే అతడి టార్గెట్.. కూలీ పనులకు పిలిచి..

వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ఓ మహిళ కొన్ని రోజుల నుండి కనిపించడం లేదు. పనికని వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఓ వ్యక్తితో మాట్టాడినట్లు గుర్తించారు. ఆ వ్యక్తిని అడిగితే తనకేమీ తెలియదని, పని కోసం అడిగి.. ఆ తర్వాత తన దారి తాను వెళ్లిపోయినట్లు చెప్పాడు. అయితే పొంతన లేకుండా సమాధానాలు చెబుతుండటంతో పోలీసులకు అనుమానం ఏర్పడి.. తమదైన స్టైల్లో విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను తానే చంపేసినట్లు వెల్లడించాడు. ఒకరిని కాదూ.. ఏకంగా ఆరుగుర్ని హత్య చేసినట్లు ఆ సైకో చెప్పడంతో ఖంగుతిన్నారు పోలీసులు.

మహిళలే అతడి టార్గెట్. పదో పరకో ఆశపడి కూలి పనులకు వెళుతున్న మహిళలపై కన్నేస్తాడు. వారి దగ్గరకు వెళ్లి.. పని ఉందంటూ పిలుస్తాడు. అనంతరం ఆటోలో ఎక్కించుకుని.. నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి వారిని చంపేస్తాడు. అనంతరం ఏమీ ఎరగన్నట్లు ఉంటాడు. ఇలా ఒకరిని కాదూ ఆరుగురు మహిళల్ని చంపేశాడు. కానీ ఇంత మంది చనిపోయినా పోలీసులకు సమాచారం లేదు. చివరకు ఏడో మహిళ హత్యకు గురి కాగా, పోలీసులకు సమాచారం అందింది. విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిష్టప్ప అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత ఆ దుర్మార్గుడు నేరాన్ని అంగీకరించలేదు. పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే.. అసలు విషయం కక్కాడు.

Women are his target

వివరాల్లోకి వెళితే.. సర్వోబీ అనే మహిళ ఈ నెల 29న కూలి పనుల నిమిత్తం తాండూరుకు రాగా, కూలీ పనుల కోసం కిష్టప్ప ఆటోలో తీసుకెళ్లాడు. నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెను హత్య చేసి మూటగడ్డి పడేశాడు.  ఆమె ఒంటిపై ఉన్న వెండి, బంగారు ఆభరణాలు దోచేశాడు. సదరు మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిల్లర్ కిష్టప్ప అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను చంపి.. ఒంటిపై ఉన్న వస్తువులను దోచుకెళ్లినట్లు చెప్పాడు. ఒంటిపై ఉండే నగల కోసమే గతంలో కూడా ఆరుగుర్ని చంపేశానని చెప్పడంతో నోరెళ్లబెట్టారు పోలీసులు.

Women are his target

అతడు చెప్పిన వివరాల ప్రకారం.. పెద్దముల్‌ మండలం తట్టెపల్లి అడవి ప్రాంతంలో పోలీసులు మూడు రోజులపాటు జల్లెడ పట్టారు. గురువారం సాయంత్రం సిద్ధమడుగు తాండ అటవీ ప్రాంతంలో ఓ సంచిలో కుళ్లిపోయిన మహిళా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కనిపించకుండా పోయిన మహిళ.. ఆమె అని నిర్ధారించుకుని.. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కిష్టప్ప గతంలో కూడా వికారాబాద్‌ యాలాల దారుర్‌ ప్రాంతాలలో కూలీలకు వచ్చే మహిళలను టార్గెట్‌ చేసి వారిని తీసుకువెళ్లి నిర్మానుష ప్రదేశంలో హత్య చేసేవాడని తెలుస్తుంది. ఇలా ఇప్పటివరకు జిల్లాలలో నాలుగు హత్య నేరాలుగా కిష్టప్పపైన ఉన్నట్లుగా సమాచారం. సైకోపై కేసు నమోదు చే సిన పోలీసులు .. మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet