iDreamPost

చనిపోతూ కూడా దారుణం! ఈమెని ఆ దేవుడు కూడా క్షమించడు ఏమో!

సమస్యలు ఏవైనా సాల్వ్ చేసుకోవాల్సిందే భార్యా భర్తలే. కానీ చిన్న చిన్న వాటికే ఒకరిపై ఒకరు అరుచుకుంటూ, గొడవ పడుతూ.. సమస్యను మరింత పెద్దది చేసుకుంటున్నారు. దీని వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్లు..

సమస్యలు ఏవైనా సాల్వ్ చేసుకోవాల్సిందే భార్యా భర్తలే. కానీ చిన్న చిన్న వాటికే ఒకరిపై ఒకరు అరుచుకుంటూ, గొడవ పడుతూ.. సమస్యను మరింత పెద్దది చేసుకుంటున్నారు. దీని వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్లు..

చనిపోతూ కూడా దారుణం! ఈమెని ఆ దేవుడు కూడా  క్షమించడు ఏమో!

కుటుంబం అన్నాక సమస్యలు వస్తుంటాయి..పోతుంటాయి. కానీ భార్యా భర్తలు మాత్రం కడదాకా కలిసి ఉండాల్సిన వాళ్లు.. సమస్య ఏదైనా సాల్వ్ చేసుకోవాల్సింది కూడా దంపతులే. ఇబ్బందులు వెంటాడుతున్నప్పుడు భార్య ఒక మాట అందని భర్త, పతి అరిచాడని సతి తీవ్రంగా ఆలోచిస్తూ అనార్థాలకు, అపార్థాలకు తావునిస్తున్నారు. ఒకరిపై ఒకరు అరుచుకోవడం, కోట్లాడుకోవడంతో  చులకన భావం కలగడమే కాకుండా.. తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా పురిగొల్పుతున్నాయి. వీటి వల్ల భార్యా భర్తలే కాదూ.. పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. ఈ ఆవేశంలో పిచ్చి పనులు చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తోన్న మహిళ కూడా ఆవేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని పాలక్కాడ్ కు చెందిన విన్సీ, మాకోన్ సురేష్ భార్యా భర్తలు. వీరికి పెళ్లై పదకొండేళ్లు అవుతుంది. చానాళ్లకు వీరికి పాప పుట్టింది. పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత వీరి ఇంట్లో చిరునవ్వులు విరబూసాయి. ఆ పాపకు ప్రస్తుతం మూడేళ్లు. అయితే ఇటీవల కాలంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ కుటుంబ కలహాల కారణంగా విన్సీ చనిపోవాలని భావించింది. తాను చనిపోతే.. పిల్లను ఎవ్వరూ చూసుకుంటారునుకుందో ఏమో..కఠిన నిర్ణయం తీసుకుంది. పది రోజుల క్రితం భర్త సురేష్ బయటకు వెళ్లగానే.. ఐస్ క్రీం తీసుకు వచ్చి.. అదీ ఆమె తిని.. కొంత కూతురికి తినిపించింది.

ఐస్ క్రీం చూడగానే.. పాప గంతులేసుకుంటూ లాగించేసింది. అంతలో బయటకు వెళ్లి వచ్చిన సురేష్.. ఇంట్లోకి వెళ్లి చూడగా.. భార్య, పాప అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే సురేష్ పాలక్కాడ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే భార్య పరిస్థితి విషమంగా తయారవ్వడంతో.. త్రిసూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతూ విన్సీ మృతి చెందింది. ప్రస్తుతం పాపకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెబుతున్నారు. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మృతికి కుటుంబ కలహాలా లేక ఇతర కారణాల అన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. చిన్న చిన్న గొడవలకు తమతో పాటు బిడ్డలను పొట్టన పెట్టుకోవాలనుకున్న ఈమెను ఆ దేవుడు కూడా క్షమించడేమో..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి