iDreamPost

హీరోయిన్ లాంటి అందం! కానీ.., డబ్బు కోసం ఆ పని! ఇంత నీచమా?

ఇంట్లో ఉన్న అమ్మాయి.. రోజూ ఏడుస్తూ కనిపించేది. పాపం ఆమెకు ఏం కష్టమొచ్చిందో .. అనుకునే వారు ఇరుగు పొరుగు. ఇంటి ఓనర్ కూడా ఆ అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఓ రోజు ఫేషియల్ చేయించుకోవడానికి బయటకు వెళ్లింది.

ఇంట్లో ఉన్న అమ్మాయి.. రోజూ ఏడుస్తూ కనిపించేది. పాపం ఆమెకు ఏం కష్టమొచ్చిందో .. అనుకునే వారు ఇరుగు పొరుగు. ఇంటి ఓనర్ కూడా ఆ అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఓ రోజు ఫేషియల్ చేయించుకోవడానికి బయటకు వెళ్లింది.

హీరోయిన్ లాంటి అందం! కానీ.., డబ్బు కోసం ఆ పని! ఇంత నీచమా?

ఈ ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు మౌనిక. చూడటానికి హీరోయిన్ లా ఉంటుంది. చిన్న ఉద్యోగం చేసుకుంటూ.. ఓ ఇంట్లో అద్దెకు జీవిస్తూ ఉండేది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. తన పని తాను చేసుకునేది. మౌనిక నడకను, ఆమె ప్రవర్తన తీరును చూసిన చుట్టు ప్రక్కల ప్రజలు.. ఈ పిల్ల ఒట్టి పిచ్చి మాలోకంలా ఉంది. ఎలా బ్రతుకుతుందో ఏంటో అనుకున్నారు. అంతలో మౌనిక ఇంటి యజమానురాలు హత్యకు గురైంది. బయటకు పని మీద వెళ్లి వచ్చిన మౌనిక.. ఇదేంటీ ఇలా జరిగింది అంటూ ఆశ్చర్యపోవడంతో పాటు విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు కానీ తెలియదు లేదు.. అద్దెకు దిగిన అమ్మాయే అసలు హంతకురాలని. మౌనికనే ఇంటి ఓనర్ భార్యను హత్య చేసిందని తెలిసే సరికి ఆశ్చర్యపోయారు ఇరుగు పొరుగు.

ప్రియుడికి బైక్ కొనిపెట్టేందుకు డబ్బులు అవసరమై.. ఇంటి యజమానురాలిని హత్య చేసి.. ఆమె మెడలోని బంగారాన్ని ఎత్తుకెళ్లి.. తాకట్టు పెట్టింది మౌనిక. తన స్వలాభం కోసం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోన సంద్రలో గురుమూర్తి, భార్య దివ్య, అమ్మ, రెండేళ్ల చిన్నారితో జీవిస్తున్నాడు. అతడు కెంగేరీలోని శివనపాళ్యలో సెలూన్‌ నడుపుతున్నాడు. నాలుగు నెలల క్రితం ఓ కొత్త ఇంటిని నిర్మించుకోగా.. కొంత భాగాన్ని కోలారుకు చెందిన మౌనికకు అద్దెకు ఇచ్చాడు. ఆమె ఓ కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తుంది. బ్యాచ్‌లర్‌కు రూమ్ ఇవ్వరు కనుక.. ప్రియుడ్ని భర్తగా చెప్పి.. ఇళ్లు తీసుకున్నాక.. ఒంటరిగా ఉండటం మొదలు పెట్టింది.

పలు మార్లు ఇంట్లో నుండి బయటకు ఏడ్చుకుంటూ వచ్చేది. ఆ అమ్మాయికి ఏవో కష్టాలు ఉన్నాయిలే అనుకునేవారంతా. మౌనిక ఉద్యోగం మానేయడంతో అప్పులు తీర్చలేక ఇబ్బంది పడేది. ఇంతలో ఆమె కన్ను.. ఇంటి ఓనర్ భార్య మెడలోని చెయిన్ పై కన్ను పడింది. ప్రియుడు కూడా బండి కొనుక్కోవాలి డబ్బులు సర్దవా అంటూ అడగటం స్టార్ట్ చేశాడు. దీంతో ఈ నెల 10న గురుమూర్తి షాపుకు వెళ్లగా.. తల్లి బయట పని మీద వెళ్లింది. దివ్య, ఆమె బిడ్డ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అదే అదునుగా భావించిన మౌనిక.. దివ్య దగ్గరకు వెళ్లి.. ఆమెను గొంతు నులిమి చంపేసి.. ఆమె మెడలో ఉన్న 30 గ్రాముల బంగారాన్ని తీసుకుని..స్థానిక వడ్డీ వ్యాపారి వద్ద తాకట్టు పెట్టింది. ఆ తర్వాత ఏమీ ఎరుగన్నట్లు ఇంటికి వచ్చింది.

గురుమూర్తి ఫోన్ చేసినా దివ్య స్పందించకపోవడంతో మౌనికకు కూడా ఫోన్ చేశాడు. మౌనిక తాను బయటకు వెళ్లినట్లు చెప్పింది. కొన్ని గంటల తర్వాత గురుమూర్తి ఇంటికి వెళ్లి చూసే సరికి ఓ గదిలో భార్య శవమై కనిపించింది. దీంతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉండటంతో.. తెలిసిన వ్యక్తుల పనేనని గ్రహించారు. ఈ క్రమంలో మౌనికను విచారించగా.. తొలుత తనకేమీ తెలియదని బుకాయించింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఇరుగు పొరుగు.. ఇది అమాయకురాలు అనుకున్నాం.. ఇలా కొంపముంచేందేమీటీ రా అని చర్చించుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి