iDreamPost
android-app
ios-app

కేంద్ర విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష జీతం.. వెంటనే అప్లై చేసుకోండి

PGCIL Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. కేంద్ర విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

PGCIL Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. కేంద్ర విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

కేంద్ర విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష జీతం.. వెంటనే అప్లై చేసుకోండి

ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. రైల్వే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, విద్యుత్ సంస్థలు ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాయి. మరోవైపు బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా వందలకొద్ది ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే వారికి ఇదే మంచి ఛాన్స్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోవచ్చు. జాబ్ లేదన్న చింత తీరిపోయే అవకాశం వచ్చింది. కేంద్ర విద్యుత్ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్ష జీతం పొందొచ్చు.

లైఫ్ లో ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి ఇదే మంచి ఛాన్స్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూసే వారు ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. పీజీసీఐఎల్ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 802 ఖాళీలను భర్తీ చేయనుంది. విభాగాల వారీగా భర్తీకానున్న పోస్టులను చూసినట్లైతే.. డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులు 600, డిప్లొమా ట్రైనీ (సివిల్) పోస్టులు 66, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెచ్‌ఆర్‌) పోస్టులు 79, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఎ) పోస్టులు 35, అసిస్టెంట్ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఎ) పోస్టులు 22 భర్తీకానున్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీబీఏ/ బీబీఎం/ బీబీఎస్‌, బీకాం, ఇంటర్‌ సీఏ/ ఇంటర్‌ సీఎంఏ ఉత్తీర్ణులైన వారు అర్హులు.

అభ్యర్థుల వయసు 27 ఏళ్లకు మించకూడదు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డాక్యూమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకు రూ.21 వేల 500 నుంచి రూ.74 వేలు ఉంటుంది. ఇతర పోస్టులకు రూ.24,000 నుంచి రూ.1 లక్ష 8 వేలు ఉంటుంది. దరఖాస్తు ఫీజు అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకు రూ.200 చెల్లించాలి. ఇతర పోస్టులకు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 12వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం www.powergrid.in వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.