iDreamPost
android-app
ios-app

గజినీ మూవీ సిక్వెల్ పై క్లారిటీ.. ?

  • Published Oct 26, 2024 | 3:32 PM Updated Updated Oct 26, 2024 | 3:32 PM

Ghajini 2: సూర్య నటించిన గజినీ సినిమాను ఎవరు మరిచిపోలేరు. సూర్య కెరీర్ లోనే ఇది పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సిక్వెల్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. దాదాపు అది కన్ఫర్మ్ అయ్యేలానే కనిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Ghajini 2: సూర్య నటించిన గజినీ సినిమాను ఎవరు మరిచిపోలేరు. సూర్య కెరీర్ లోనే ఇది పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సిక్వెల్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. దాదాపు అది కన్ఫర్మ్ అయ్యేలానే కనిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 26, 2024 | 3:32 PMUpdated Oct 26, 2024 | 3:32 PM
గజినీ మూవీ సిక్వెల్ పై క్లారిటీ.. ?

తమిళ సినిమా నుంచి వచ్చిన కొంతమంది హీరోలకు తెలుగు వారి దగ్గర మంచి ఆదరణ ఉంది. ఇక ఈ మధ్య కాలంలో అలా ఆదరించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అలా వచ్చిన తమిళ హీరోలలో రజినీకాంత్ , కమల్ హాసన్ తో పాటు ఇప్పుడు సూర్య కూడా ఒకరు. తెలుగు స్టేట్స్ లో సూర్య అడాప్టెడ్ సన్ గా పిలవబడుతూ ఉంటాడు. ఈ నవంబర్ 14కు సూర్య ‘కంగువా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో సూర్య బిజీ బిజీగా ఉన్నాడు. తెలుగులో సాలిడ్ కం బ్యాక్ కోసం చూస్తున్నాడు. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో తెలుగు ఆడియన్స్ ప్రేమ చూసి.. సూర్య కాస్త ఎమోషనల్ అయ్యాడు. కంగువా మూవీ కనుక ప్రేక్షకులను మెప్పిస్తే.. తెలుగులో సూర్యకు పూర్వ వైభవం దక్కుతుంది. అయితే ఈ సినిమా గురించి పక్కన పెడితే.. ఇప్పుడు సూర్య అప్ కమింగ్ లిస్ట్ లో మరో ఇంట్రెస్టిగ్ మూవీకి సిక్వెల్ వినిపిస్తుంది.

ఆ సిక్వెల్ మరేదో కాదు.. సూర్య కెరీర్ లోనే పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచిన గజినీ. అసలు సూర్యకు ఎలాంటి మార్కెట్ లేని సమయంలోనే.. ఒక్కసారిగా హీరోకు , దర్శకుడికి స్టార్ డం తీసుకొచ్చిన మూవీ ఇది. డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్  పేరు మోత మోగిపోయింది. ఆ సమయంలో ఉన్న స్టార్ హీరోలు కూడా పిలిచి మరీ ఆఫర్లు ఇచ్చారు. ఏకంగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఈ సినిమాను రీమేక్ చేశారు. అక్కడ కూడా ఇది బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా వచ్చి దాదాపు 20 సంవత్సరాలు దాటుతున్నా కానీ.. ఇంకా చెక్కు చెదర కుండా అదే కల్ట్ స్టేటస్ ను మైంటైన్ చేస్తుంది. అయితే ఇప్పుడు గత రెండు మూడు రోజులు నుంచి ఈ సినిమా సిక్వెల్ గురించి టాక్ వినిపిస్తుంది. కానీ నిజామా కాదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు అభిమానులు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ప్రకారం చూస్తే దాదాపు ఈ వార్త నిజమయ్యేలా కనిపిస్తుంది. అల్లు అరవింద్ ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్లే విధంగా దానికి తగిన ప్లాన్స్ చేస్తున్నట్లు టాక్. సో త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ వచ్చినా రావొచ్చు.

ఇక రీసెంట్ గా అమీర్ ఖాన్ కూడా గజినీ సిక్వెల్ రాసుకొస్తే.. చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీడియాతో ముచ్చటించారు. అటు సూర్య కూడా నార్త్ పర్యటనలో ఉన్నప్పుడు.. ఫ్యూచర్ లో గజినీ 2 ఉంటుందని.. తనను అమీర్ ఖాన్ ను ఒకేసారి స్క్రీన్ మీద చూడొచ్చని చెప్పాడు. దీనితో అప్పటినుంచి అభిమానులలో గజినీ పై క్యూరియాసిటీ పెరిగింది. అయితే మరి ఇద్దరు కలిసి ఒకే మూవీలో నటిస్తారా లేదా వేరే కొత్త స్టోరీతో సూర్య , అమీర్ కలుస్తారా… ఏదైనా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారా.. అనే సందేహాలు మొదలయ్యాయి. ఇవన్నీ తెలియాలంటే మేకర్స్ నుంచి ఏదైనా సాలిడ్ అప్డేట్ రావాల్సిందే. ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio