iDreamPost
android-app
ios-app

పుష్ప2 ఓపెనింగ్స్ డే రికార్డ్స్ కోసం క్లియర్ స్కెచ్

  • Published Oct 26, 2024 | 5:09 PM Updated Updated Oct 26, 2024 | 5:09 PM

Pushpa 2 Movie Update : ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప మూవీ క్రేజ్ ఓ రేంజ్ లో మోత మోగిపోతుంది. అసలే ఒక రోజు ముందు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కారణం లేకుండా ఇలా చేయరు. సో మొదటి రోజు ఓపెనింగ్స్ కోసం పుష్ప టీం భారీగానే ప్లాన్ చేసింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి .

Pushpa 2 Movie Update : ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప మూవీ క్రేజ్ ఓ రేంజ్ లో మోత మోగిపోతుంది. అసలే ఒక రోజు ముందు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కారణం లేకుండా ఇలా చేయరు. సో మొదటి రోజు ఓపెనింగ్స్ కోసం పుష్ప టీం భారీగానే ప్లాన్ చేసింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి .

  • Published Oct 26, 2024 | 5:09 PMUpdated Oct 26, 2024 | 5:09 PM
పుష్ప2 ఓపెనింగ్స్ డే రికార్డ్స్ కోసం క్లియర్ స్కెచ్

మరి కొద్దీ రోజుల్లో పుష్ప రాజ్ రూలింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. కనివిని ఎరుగని రేంజ్ లో ఈ సినిమా పై వరల్డ్ వైడ్ హైప్ మొదలైంది. ఇక రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ అన్ని ప్రశ్నలకు చెక్ పెట్టేసింది. పైగా పుష్ప 3 కి లీడ్ కూడా ఇచ్చింది. సో ఫ్యాన్స్ కు డబుల్ హ్యాపీ. రిలీజ్ కు కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. ఓ వైపు షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. మరో వైపు ప్రమోషన్స్ , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు పక్కా ప్లానింగ్స్ ను రెడీ చేస్తున్నారు. ఇలా పుష్ప టీం అంతా కూడా తీరిక లేకుండా సినిమా పనుల్లో మునిగితేలుతున్నారు. పైగా సినిమాను చెప్పిన టైం కు ఓ రోజు ముందే రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. మామూలుగానే సినిమాకు ఓ రేంజ్ లో హైప్ నడుస్తుంది. ఇక మూవీ రిలీజ్ డేట్ ప్రీ పోన్ అవ్వడంతో ఇంకాస్త బజ్ పెరిగింది.

పుష్ప మూవీ రిలీజ్ టైం కు థియేటర్ లో ఏ సినిమాలు రిలీజ్ కు రెడీ గా లేవు. సో ముందుగా చెప్పిన టైం అంటే డిసెంబర్ 6న రిలీజ్ చేసినా కానీ.. పుష్ప కు అడ్డు ఎవరు లేరు. కానీ చెప్పిన కంటే ఒక రోజు ముందు రిలీజ్ చేసి .. లాంగ్ వీకెండ్ ను మైంటైన్ చేసే ప్లాన్ వేసింది పుష్ప టీం. ఇలా ఓపెనింగ్ డే కలెక్షన్స్ కోసం గట్టి ప్లాన్ నే రెడీ చేసింది. ఫస్ట్ డే వసూళ్లలో సరికొత్త రికార్డ్ సృష్టించాలంటే.. ఆ రోజు మ్యాగ్జిమమ్ స్క్రీన్స్ లో సినిమా ప్లే అవ్వాలి. బెన్ ఫిట్ షోస్ , మిడ్ నైట్ షోస్ కు తిరుగు ఉండకూడదు. ఇప్పుడు పుష్ప టీం ఫాలో అవుతున్న ప్లాన్ కూడా ఇదే. ఇప్పటివరకు ఏ సినిమాకు కనివిని ఎరుగని రీతిలో ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా 11500 స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ ఈ స్క్రీన్ కౌంట్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

ఇటు ఏపీ , నైజాంలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచే ఈ షోస్ స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో రికార్డ్ బ్రేకింగ్ షోస్ కు లైన్ క్లియర్ అవుతుంది. ఇలా ఏ రకంగా చూసినా కానీ పుష్ప 2 మొదటి షో కౌంట్ భారీగా ఉండబోతుంది. ఒక్కసారి ట్రైలర్ , ఐటెం సాంగ్ రిలీజ్ అయ్యాయంటే ఇక ఈ సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దు. ఐటెం సాంగ్ షూట్ ఒకటే బ్యాలెన్స్ ఉందని.. దానిని నవంబర్ మొదటి వారానికి కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం . ఆల్రెడీ ఈ సాంగ్ కోసం బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. సో ఇంకా రిజల్ట్ ఏ రేంజ్ లో ఉండబోతున్నది మాత్రమే బ్యాలెన్స్. దాదాపు దీపావళి నుంచి మూవీ అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişjojobet giriş