iDreamPost
android-app
ios-app

సెంచరీ తర్వాత సిల్లీగా ఔటైన కోహ్లీ! పేలుతున్న మీమ్స్‌

  • Published Jul 22, 2023 | 10:08 AM Updated Updated Jul 22, 2023 | 10:08 AM
  • Published Jul 22, 2023 | 10:08 AMUpdated Jul 22, 2023 | 10:08 AM
సెంచరీ తర్వాత సిల్లీగా ఔటైన కోహ్లీ! పేలుతున్న మీమ్స్‌

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ టెస్ట్‌తో తన కెరీర్‌లో 500వ మ్యాచ్‌ ఆడుతున్న కోహ్లీ, ప్రత్యేకమైన ఈ మ్యాచ్‌ను సెంచరీతో మరింత స్పెషల్‌గా మార్చుకున్నాడు. కోహ్లీ కంటే ముందు 500లకి పైగా టెస్టులు ఆడిన మరే క్రికెటర్‌ కూడా తమ 500వ మ్యాచ్‌లో సెంచరీ కాదు కదా.. కనీసం హాఫ్‌ సెంచరీ కూడా చేయలేదు. ఈ సెంచరీతో కోహ్లీ తన కెరీర్‌లో 76వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే టెస్ట్‌ల్లో 29వ సెంచరీ బాదాడు. మొత్తం మీద 121 పరుగులు చేసిన కోహ్లీ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. దీంతో కోహ్లీపై జోకులు పేలుతున్నాయి. అందుకు కారణం కూడా కోహ్లీ చేసిన కామెంటే. అదేంటంటే..

తొలి రోజు కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ జోషూవా డా సిల్వా-కోహ్లీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వారిద్దరూ మాట్లాడుకున్న మాటలు స్టంప్‌ మైక్‌లో రికార్డ్‌ అయ్యాయి. అందులో.. కోహ్లీ.. ‘నువ్వు డబుల్స్‌ను దొంగిలిస్తున్నావ్‌’ అని డా సిల్వా అనగా.. ‘నేను 2012నుంచి డబుల్స్‌ను దొంగిలిస్తున్నాను’ అంటూ కోహ్ల బదులిచ్చాడు. బౌండరీల కంటే కూడా సింగిల్స్‌, డబుల్స్‌ రూపంలోనే కోహ్లీ ఎక్కువ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే రెండో పరుగు కోసం ఎంతో శ్రమించి డైవ్‌ కొడుతూ మరీ పరుగు పూర్తి చేశాడు. ఆ సమయంలోనే ఈ సంభాషణ చోటు చేసుకుంది.

అయితే కోహ్లీ వికెట్ల మధ్య ఎంత వేగంగా పరిగెత్తుతాడో అందరికి తెలిసిందే. సింగిల్‌ వచ్చే చోట రెండు పరుగుల కోసం, రెండు వచ్చే దగ్గర మూడు పరుగుల కోసం ప్రయత్నిస్తుంటాడు. మొదటి రన్‌ను వీలైనంత వేగంగా తీస్తాడు. రెండో పరుగు దొరుకుతుందని. ఇలా కోహ్లీ వికెట్ల మధ్య చిరుతా పరిగెత్తుతాడు. ఈ టెస్ట్‌లోనూ తొలి రోజు అలాగే పరుగులు రాబట్టాడు. సెంచరీ తర్వాత కూడా సింగిల్స్‌, డబుల్స్‌ను వదిలిపెట్టని కోహ్లీ.. వారికన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 99వ ఓవర్‌ రెండో బంతిని డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు.

అది ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని స్వ్కేర్‌లెగ్‌ దిశగా వెళ్లింది. వెంటనే కోహ్లీ రిస్క్‌ తీసుకుంటూ సింగిల్‌ కోసం పరిగెత్తాడు. కానీ, జోసఫ్‌ నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌ వైపు డైరెక్ట్‌ త్రో కొట్టడంతో రనౌట్‌ అయ్యాడు. తొలి రోజు సింగిల్స్‌, డబుల్స్‌ను దొంగిలిస్తానని చెప్పిన కోహ్లీ.. అలా దొంగిలించే క్రమంలోనే దొరికిపోయాడంటూ క్రికెట్‌ అభిమానులు సరదాగా పేర్కొంటున్నారు. రనౌట్‌ సంగతి ఎలాగున్నా.. సెంచరీతో భారీ రికార్డును నెలకొల్పడమే కాకుండా జట్టుకు మంచి స్కోర్‌ అందించాడు. మరి కోహ్లీ రనౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కొడుకు ఆటను చూసేందుకు రాలేదు.. కోహ్లీ కోసం వచ్చింది!