iDreamPost
android-app
ios-app

రోహిత్, కోహ్లీ ఎక్కడ.. ఇంత నిరాశ ఎందుకు?

వరల్డ్ కప్ ముగిసిన తర్వత టీమిండియా స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీడియా కంట పడలేదు. దీంతో వీల్లిద్దరు ఎక్కడ అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

వరల్డ్ కప్ ముగిసిన తర్వత టీమిండియా స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీడియా కంట పడలేదు. దీంతో వీల్లిద్దరు ఎక్కడ అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

రోహిత్, కోహ్లీ ఎక్కడ.. ఇంత నిరాశ ఎందుకు?

వన్డే వరల్డ్ కప్ 2023 కోట్లాది మంది భారతీయులను నిరాశకు గురిచేసింది. స్వదేశంలో జరిగిన టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఆడిన 10 మ్యాచ్ లలో అసాధారణ విజయాలను నమోదు చేస్తూ ప్రపంచకప్పుపై ఆశలను రేకెత్తించింది రోహిత్ సేన. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్ ఈ సారి కప్పు కొట్టి ఛాంపియన్ గా నిలుస్తుందని అంతా భావించారు. కానీ తుది పోరులో అందరి ఆశలను అడియాశలు చేస్తూ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవి చూసింది టీమిండియా. దీంతో ఆటగాళ్లతో పాటు క్రికెట్ ప్రియులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ప్రపంచకప్ ముగిసి పదిరోజులు కావొస్తున్నా టీమిండియా సారథి, కింగ్ కోహ్లీ మాత్రం మీడియా కంట పడటం లేదు. దీంతో కోహ్లీ, రోహిత్ ఎక్కడా.. అంటూ ఫ్యాన్స్ చర్చలు మొదలు పెట్టారు.

మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆధరణ ఏపాటిదో మాటల్లో చెప్పలేం. క్రికెట్ గురించి, టీమిండియా ఆటగాళ్ల గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు ఫ్యాన్స్. తమ అభిమాన ఆటగాళ్లు కొద్ది రోజులు కనిపించకున్నా ఏమైఉంటుందని ఆరా తీస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బయటి ప్రపంచానికి కనపడకపోవడంతో వీల్లిద్దరు ఎక్కడ ఉన్నారంటూ చర్చించుకుంటున్నారు. ఆటలో గెలుపోటములు సహజం.. ఓడిపోయినంత మాత్రాన ఇంత నిరాశ పడడం ఎందుకు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

విరాట్, రోహిత్ ఓటమి నుంచి తేరుకుని మరో కొత్త ఉత్సాహంతో మున్ముందు జరుగబోయే సిరీస్ లపై దృష్టిపెట్టాలి. అలా కాకుండా రూమ్ కే పరిమితమైతే ప్రయోజనం ఏంముంటుందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఓటమితో కుంగిపోకుండా రాబోయే మ్యాచ్ ల కోసం సన్నద్ధం కావాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆటలో అద్భుతమైన నైపుణ్యం ఉన్నటువంటి కోహ్లీ, రోహిత్ నిరాశ చెందకుండా ఆటపై దృష్టిపెట్టాలని అభిమానులు కోరుతున్నారు. ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటికీ టోర్నీలో పాల్గొన్న అన్ని టీములను ఓడించి ఛాంపియన్లుగా నిలిచారని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రోహిత్, కోహ్లీలు నిరాశ చెందకుండా రాబోయే టోర్నీలకు సిద్ధమవ్వాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మీడియా కంట పడకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి