iDreamPost

ఆస్ట్రేలియా అహంకారం! కావాలని రోహిత్ కి అవమానం!

  • Author Soma Sekhar Published - 09:41 AM, Tue - 14 November 23

వరల్డ్ కప్ లో సెమీస్ కు ముందు టీమిండియా సారథి రోహిత్ శర్మకు అవమానం జరిగింది. ఆస్ట్రేలియా తన అహంకారాన్ని మరోసారి బయటపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

వరల్డ్ కప్ లో సెమీస్ కు ముందు టీమిండియా సారథి రోహిత్ శర్మకు అవమానం జరిగింది. ఆస్ట్రేలియా తన అహంకారాన్ని మరోసారి బయటపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Author Soma Sekhar Published - 09:41 AM, Tue - 14 November 23
ఆస్ట్రేలియా అహంకారం! కావాలని రోహిత్ కి అవమానం!

ప్రపంచ కప్ 2023 లీగ్ దశ ముగిసింది. టాప్ ఫోర్ టీమ్స్ గా టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ నిలిచాయి. ఇక ఈ నాలుగు జట్ల మధ్య సెమీస్ పోరు నవంబర్ 15, 16 తేదీల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తన అహంకారాన్ని ప్రదర్శించింది. ఈ విశ్వసమరంలో ఇటు కెప్టెన్ గా, అటు బ్యాటర్ గా దుమ్మురేపుతున్న టీమిండియా సారథి రోహిత్ శర్మను కావాలనే అవమానపరిచింది. ఈ మెగాటోర్నీలో 9 మ్యాచ్ ల్లో 503 పరుగులు చేసి.. లీడింగ్ స్కోరర్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు హిట్ మ్యాన్. మరి రోహిత్ శర్మకు జరిగిన అవమానం ఏంటి? ఆసీస్ అహంకారాన్ని ఎందుకు ప్రదర్శించిందో ఓసారి పరిశీలిద్దాం.

రోహిత్ శర్మ.. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో టీమిండియాను తిరుగులేని జట్టుగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అటు సారథిగా.. ఇటు బ్యాటర్ గా సత్తాచాటుతున్నాడు హిట్ మ్యాన్. ఈ మెగాటోర్నీలో ఆడిన 9 మ్యాచ్ ల్లో ఓ సెంచరీతో 503 రన్స్ బాది అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల లిస్ట్ లో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. టీమిండియా కెప్టెన్ ను దారుణంగా అవమానించింది. ఆ వివరాల్లోకి వెళితే.. క్రికెట్ ఆస్ట్రేలియా 2023 వరల్డ్ కప్ టీమ్ ను ప్రకటించింది. ఈ ప్రపంచ కప్ లో సత్తాచాటిన ప్లేయర్లను ఎంపిక చేసి.. 11 మంది ప్లేయర్ల లిస్ట్ ను విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా నుంచి నలుగు ప్లేయర్లను తుది జట్టులోకి తీసుకుంది. అందులో ఈ మెగాటోర్నీలో లీడింగ్ స్కోరర్ గా ఉన్న విరాట్ కోహ్లీని, స్టార్ ఆల్ రౌండర్ జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలను టీమ్ లోకి తీసుకుంది.

ఇక సఫారీ టీమ్ నుంచి క్వింటన్ డికాక్, మార్క్రమ్, మార్కో జాన్సెన్ లకు చోటు కల్పించింది. ఆసీస్ నుంచి సూపర్ ఫామ్ లో ఉన్న డేవిడ్ వార్నర్, మాక్స్ వెల్ లతో పాటుగా ఈ వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆడమ్ జంపాను తమ టీమ్ లోకి తీసుకుంది. వీరందరితో పాటుగా కివీస్ నయా సంచలనం రచిన్ రవీంద్రను టాప్ ప్లేయర్ గా చోటు కల్పించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్ ను మాత్రం తన వరల్డ్ కప్ టీమ్ లోకి తీసుకోలేదు క్రికెట్ ఆస్ట్రేలియా. తనకంటే తక్కువ పరుగులు చేసిన వార్నర్ ను తమ టీమ్ లోకి తీసుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా కావాలనే రోహిత్ ను పక్కనపెట్టింది. ఇలా చేయడం ద్వారా ఆ ప్లేయర్ ను మానసికంగా ఇబ్బంది పెట్టొచ్చు అనేదే కంగారూల ప్లాన్ అని తెలుస్తోంది.

ఇక ఈ విషయం తెలిసిన రోహిత్ ఫ్యాన్స్ క్రికెట్ ఆస్ట్రేలియాపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వరల్డ్ కప్ లో ఎవ్వరూ సాధించని రికార్డులు సాధిస్తూ.. దూసుకెళ్తున్న రోహిత్ గణాంకాలు మీ కంటికి కనిపించలేదా? అంటూ మండిపడుతున్నారు. మీరు చోటు కల్పించేది ఏంటి? హిట్ మ్యాన్ బ్యాటింగ్ కు ప్రపంచమే ఫిదా అవుతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కావాలనే రోహిత్ ను అవమానించిన క్రికెట్ ఆస్ట్రేలియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి