iDreamPost

రాజధాని భూ కుంభకోణంలో మూడో అరెస్ట్

రాజధాని భూ కుంభకోణంలో మూడో అరెస్ట్

తెలుగుదేశం పాలనలో రాజధాని పేరిట సాగిన భూ కుంభకోణంలోని వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వైసిపి మొదటి నుంచి ఆరోపిస్తునట్టుగానే రాజధాని పేరిట భారి ఏత్తున భూముల విషయంలో అవకతవకలు జరిగినట్టు తాజా పరిణామాలు చూస్తే అర్ధం అవుతుంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక నియమించి సిట్ బృందం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట సాగించిన భూ దందాలోని నిజనిజాలను ఆదారాలతో సహా వేలికితీసే పనిలో ఉండగా.. తాజాగా మరో అడుగు ముందుకు వేసి పూర్తి ఆదారాలతో అరెస్టులు ప్రారంభించింది.

ఇప్పటికే సిట్ అధికారులు అమరావతి పరిధిలో టీడీపీ నేత రావెల గోపాల కృష్ణ తప్పుడు పత్రాలతో భూమిని కాజేశారనే అభియొగం పై అరెస్టు చెయగా , వారం క్రిందట ఈ వ్యవహారానికి పూర్తిగా సహరించిన సి.ఆర్.డి.ఏ డిప్యుటీ కలెక్టర్ గా భాద్యతలు నిర్వహించిన మాధురీని విజయవాడలోని తన నివాసంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని అనంతరం రిమాండుకు తరలించారు. ఇప్పుడు తాజాగా డిప్యూటీ కలెక్టర్ మాధురి దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన సీఆర్డీఏ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రణధీర్ ను సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని భూ కుంభకోణంలో వరుసగా ఇది మూడో అరెస్ట్ గా చెప్పవచ్చు.

Read Also: టీడీపీని వీడబోతున్న మాజీ మంత్రి శిద్ధా.. కారణం ఇదే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి