iDreamPost

క్రేజీ మూవీకి సూపర్ ఆఫర్స్

క్రేజీ మూవీకి సూపర్ ఆఫర్స్

రాబోయే రోజుల్లో భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియా సినిమాగా రాధే శ్యామ్ ఎప్పుడు విడుదలవుతుందాని అభిమానులే కాదు ప్రేక్షకులూ ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య డైరెక్ట్ ఓటిటి కోసం ఓ సంస్థ 400 కోట్ల ఆఫర్ ఇచ్చిందనే పుకారు గట్టిగానే తిరిగిన సంగతి తెలిసిందే. అది నిజం కాదని ఐడ్రీమ్ ఆ టైంలోనే ధృవీకరించింది కూడా. ఇదిలా ఉండగా తాజాగా థియేట్రికల్ కాకుండా మిగిలిన హక్కులను అమ్మేసినట్టు లేటెస్ట్ అప్ డేట్. హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ కు, మిగిలిన భాషలు జీ5/జీ ప్లెక్స్ కు ఇచ్చినట్టు సమాచారం. అయితే ఎంత మొత్తానికి అనే గుట్టు మాత్రం బయటికి రాలేదు. ఆర్ఆర్ఆర్ తరహాలో గోప్యత మైంటైన్ చేస్తున్నారు.

సో ఇప్పుడు రాధే శ్యామ్ థియేటర్లలో ఎప్పుడు వస్తుందనేదే భేతాళ ప్రశ్న. పరిస్థితులను చూస్తుంటే దసరాకు కష్టమే అనిపిస్తోంది కానీ దీపావళికి టార్గెట్ చేయడం బెటర్. బాలన్స్ ఉన్న అతికొద్ది భాగాన్ని వచ్చే నెల లోపే పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం అవుతాయి. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన రాధే శ్యామ్ ఓ డిఫరెంట్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతోంది. యూరోప్ తో పాటు వివిధ భారీ లొకేషన్లలో షూటింగ్ చేశారు. కథ గురించి లీకులు రాకుండా జాగ్రత్త పడటంలో యూనిట్ సక్సెస్ అయ్యింది కానీ అప్ డేట్స్ మాత్రం ఆలస్యంగానే వస్తున్నాయి

ఇక రాధే శ్యామ్ తో పాటు ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2ల సంగతి కూడా తేలాల్సి ఉంది. డిజిటల్ శాటిలైట్ రైట్స్ ని చక్కగా అమ్మేసుకుంటున్నారు కానీ ఎటొచ్చి థియేటర్ల గురించి క్లారిటీ లేకపోవడంతో రిలీజ్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేకపోతున్నాయి. బాహుబలి సాహో తర్వాత వచ్చిన గ్యాప్ ని పూడ్చుకునేందుకు ప్రభాస్ వేగంగా సినిమాలు ఒప్పుకుంటునప్పటికీ కరోనా రెండు సార్లు ఆ స్పీడ్ కి బ్రేక్ వేసింది. దీని తర్వాత అది పురుష్, సలార్ లు సమాంతరంగా షూట్ జరుపుకోనుండగా నాగ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయే ప్రాజెక్ట్ మాత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి