iDreamPost

రామకృష్ణా… ఇదేమి డిమాండయ్యా ?

రామకృష్ణా…  ఇదేమి డిమాండయ్యా ?

సిపిఐ కార్యదర్శి రామకృష్ణ విచిత్రమైన డిమాండ్ చేస్తున్నాడు. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటించాలట. ఎందుకు పర్యటించాలంటే బాధితులకు ఆత్మస్ధైర్యాన్ని నింపటానికట. ఈ మేరకు జగన్ కు కార్యదర్శి రామకృష్ణ లేఖ కూడా రాశారులేండి. చాలా రోజుల నుండి చంద్రబాబునాయుడు వాయిస్ నే రామకృష్ణ కూడా వినిపిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. చంద్రబాబు డిమాండ్ నే తన డిమాండ్లుగా కార్యదర్శి వినిపిస్తున్నాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కర్నూలు జిల్లాలో కేసులు ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే. అయితే బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉన్న వనరున్నింటినీ ఉపయోగించుకుంటోంది. ఎక్కడికక్కడ జిల్లాల యాంత్రాంగం మొత్తాన్ని ఇదే విషయమై జగన్ అందుబాటులో ఉంచాడు. ఈ సమయంలో బాధితుల్లో ఆత్మ స్ధైర్యం నింపటానికి జగన్ పర్యటించాల్సిన అవసరం ఏముంది ?

క్వారంటైన్ కేంద్రాలు, ఐసొలేషన్ వార్డులను ఎందుకు ఏర్పాటు చేసి వైరస్ బాధితులను దూరంగా ఎందుకుంచుతున్నారు ? ఎందుకంటే బాధితుల నుండి మరొకరికి చాలా స్పీడుగా సోకుతుంది కాబట్టే. కరోనా బాధితులంటే వీళ్ళేమన్నా వరద, తుపాను బాధితులా నేరుగా కలిసి పరామర్శించటానికి ? అంటే రామకృష్ణ ఉద్దేశ్యంలో కరోనా బాధితులను నేరుగా కలవటమంటే జగన్ కు కుడా వైరస్ సోకాలని కోరుకుంటున్నాడా ? అన్న అనుమానం మొదలవుతోంది.

ప్రధానమంత్రి అయినా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులైన తమ ఆఫీసుల్లో కూర్చునే మొత్తం వ్యవహారాలను పర్యవేక్షస్తున్న విషయాన్ని అందరూ చూస్తున్నదే. వైరస్ కు ప్రత్యేకంగా మందు లేదు కాబట్టి లాక్ డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ ముఖ్యమంటున్నారు నిపుణులు. నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు తిరుగుతుంటేనే సోషల్ డిస్టెన్సింగ్ పాటించటం లేదంటూ ప్రతిపక్ష నేతలు గోల చేసేస్తున్నాయి. అలాంటిది సిఎం ఏదైనా జిల్లాలో పర్యటిస్తే మొత్తం అధికార వ్యవస్ధ, అధికారపార్టీ నేతలు ఒక చోట చేరిపోరా ? అప్పుడు లాక్ డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ స్పూర్తి దెబ్బతినదా ? ఈ పరిస్ధితి తలెత్తకూడదనే జగన్ ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్సులతో పరిస్ధితిని సమీక్షిస్తున్నాడు.

సరే, జగన్ సంగతి పక్కనపెట్టేస్తే బాధితుల్లో ఆత్మస్ధైర్యం నింపటానికి రామకృష్ణ ఎవరినైనా కలిశాడా ? ప్రభుత్వం దగ్గర రామకృష్ణ అనుమతి తీసుకుని క్వారంటైన్ కేంద్రాల్లో తిరిగి బాధితులను కలిసి పరామర్శిస్తానంటే ఎవరైనా వద్దంటారా ? ముందు సిపిఐ కార్యదర్శి తిరిగి తర్వాత తన సహచరులను కూడా తీసుకెళితే బాగుంటుంది. మామూలుగా జనాల దగ్గరకో లేకపోతే బాధితుల దగ్గరకో ముందుగా పరిగెత్తే రామకృష్ణ ఇపుడు మాత్రం జగన్ ను వెళ్ళాలనటంటో కుట్ర కోణమే కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి