iDreamPost

సెన్సేష్ కోసమే.. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి : సిద్దిపేట సీపీ శ్వేత

ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 30న సిద్దిపేట జిల్లా సూరంపల్లి గ్రామంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ప్రాంతం అంతా ఒక్కసారిగా అట్టుడికి పోయింది.

ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 30న సిద్దిపేట జిల్లా సూరంపల్లి గ్రామంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ప్రాంతం అంతా ఒక్కసారిగా అట్టుడికి పోయింది.

సెన్సేష్ కోసమే.. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి : సిద్దిపేట సీపీ శ్వేత

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం నడుస్తుంది. సాధారణంగా ఎన్నికల సందర్భంగా ప్రచారాలు చేసే సమయంలో ఇరు వర్గాలకు చిన్న చిన్న గొడవలు, వాదనలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు తిట్టుకోవడమే కాదు.. కొట్టుకునే స్థాయికి వెళ్తుంటారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి నేతలను హత్య చేసిన సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి. ఈ క్రమంలోనే మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ పై కత్తితో దాడి జరిగింది. తాజాగా ఈ దాడి గురించి సిద్దిపేట సీపీ సంచలన నిజాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 30న సిద్దిపేట జిల్లా సూరంపల్లి గ్రామంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ప్రాంతం అంతా ఒక్కసారిగా అట్టుడికి పోయింది. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వెంటనే నిందితుడిని కార్యకర్తలు, ప్రజలు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు రాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ శ్వేత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగ కీలు విషయాలు వెల్లడించారు.

అక్టోబర్ 30న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి కేసును వేగవంతంగా విచారిస్తున్నామన్నారు. నిందితుడు రాజు సెన్సేషన్ క్రియేట్ చేయడానికే ఈ దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని అన్నారు. నిందితుడు వారం రోజుల క్రితమే కత్తిని కొనుగోలు చేశాడని.. ఈ దాడిలో ఎవరి సహకారమైనా తీసుకున్నాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ శ్వేత తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇక రాజును బుధవారం కోర్టు ముందు హాజరు పరచగా.. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని.. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టవొద్దని కోర్టు సూచించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి