iDreamPost
android-app
ios-app

వీడియో: బిజీ బస్టాండ్‌లో జంట పిచ్చి పని.. జనం అవ్వాక్‌!

వీడియో: బిజీ బస్టాండ్‌లో జంట పిచ్చి పని.. జనం అవ్వాక్‌!

సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిపోవటానికి కొంతమంది చేస్తున్న పనులు ఆశ్చర్యంగానూ.. అసహ్యం వేసేవిలానూ ఉంటున్నాయి. తాజాగా, ఓ జంట ఇన్‌స్టా రీల్స్‌ చేయటానికి బస్టాండ్‌లో పిచ్చి పనికి తెరతీసింది. అందరూ చూస్తుండగా భర్త తన భార్యను చేతులపై మోస్తూ బస్టాండ్‌ మొత్తం తిప్పాడు. దీంతో అక్కడి జనం షాక్‌కు గురైనట్లు చూస్తూ ఉండిపోయారు. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

తమిళనాడుకు చెందిన ఓ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో తమిళ్‌ హిప్పీ కపుల్‌ అనే ఖాతా ఉంది. ఈ జంట తరచుగా రీల్స్‌ చేస్తూ ఉంటుంది. అయితే, త్వరగా ఫేమస్‌ అయిపోవాలన్న ఉద్దేశ్యంతో ఈ జంట కొంత పిచ్చి పిచ్చి పనులకు కూడా తెర తీసింది. కొద్ది రోజుల క్రితం ఈ జంట నాగర్‌కోయిల్‌లోని బస్టాండ్‌కు వెళ్లింది. అక్కడ జంటలోని భర్త తన భార్యను చేతులపై మోస్తూ అటు, ఇటు తిప్పుసాగాడు. అక్కడ బస్టాండ్‌లో ఉన్న మిగిలిన జనం వారిని చూస్తూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.

వీళ్లు ఎందుకలా చేస్తున్నారో తెలియక కొంతమంది వింతగా చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని మీడియా సంస్థలు కూడా ఆ జంట వీడియోపై న్యూస్‌ను సైతం ప్రచురించాయి. దీంతో ఆ వీడియో మీడియాలో కూడా బాగా పాపులర్‌ అయింది. ఈ నేపథ్యంలోనే తమిళ్‌ హిప్పీ జంటపై అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా ఆ జంట మాత్రం దాన్ని సింపుల్‌గా తీసుకుంది. అంతేకాదు! మీడియా బైట్‌కు సంబంధించిన వీడియోను తమ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి కృతజ్ఞతులు సైతం తెలిపింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Thanthi TV (@thanthitv)

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişRoyalbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetcasibomMadridbet telegramHoliganbet GirişGrandpashabet Giriş