iDreamPost

మండలి నిరవధిక వాయిదా… తర్వాత సమావేశాలు..

మండలి నిరవధిక వాయిదా… తర్వాత సమావేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి నిరవదికంగా వాయిదా పడింది. రెండు రోజులు సమావేశాల్లో భాగంగా గురువారం రోజు రాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ పరిపానల వికే ంద్రీకరణ, సమతుల అభివృద్ధి, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని మండలి చైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్‌ తన విచక్షణ అధికారం మేరకు రెండు బిల్లులను సెలక్ట్‌ కమిటీకి సిఫార్సు చేసిన అనంతరం సభ నిరవధిక వాయిదా పడింది.

మండలి తదుపరి సమావేశాలు మళ్లీ ఎప్పుడు జరుగుతాయన్న ఊహాగానాలు జోరుగా జరుగుతున్నాయి. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు, బిల్లులపై చర్చ.. తదితర పరిణామాలు పూర్తయ్యేందుకు కనీష్టంగా నెల, గరీష్టంగా మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అయితే మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై శాసన మండలి భవితవ్వం ఆధారపడి ఉంది. ఇప్పటికే మండలిని రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతున్న విషయం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి