iDreamPost

మహారాష్ట్ర లో మంత్రికి కరోనా

మహారాష్ట్ర లో మంత్రికి కరోనా

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశం మొత్తం మీద మహారాష్ట్రలో కేసుల సంఖ్య అత్యధికంగా నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ మంత్రికి కరోనా వైరస్ సోకిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య ఆరు వేలు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న గురువారం ఒక్కరోజే 778 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,427 కి చేరింది.

మహారాష్ట్ర లో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికం గా రాజధాని ముంబైలోని నమోదు కావడం కలకలం రేపుతోంది. ముంబైలో 24 గంటల్లో 478 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,232 కి చేరాయి. తాజాగా నగరంలో 8 మంది మరణించారు. దీంతో ముంబై నగరంలో కరోనా వల్ల మరణించినవారి సంఖ్య 168 కి చేరింది. ఆసియాలోనే అతి పెద్ద మురికి వాడ అయినా ధారావి లో కేసుల సంఖ్య 200 దాటింది. మరణాలు 20 కి చెరువుగా ఉన్నాయి. దేశం మొత్తం మీద ఇప్పటి వరకు 23 వేల మందికి వైరస్ సోకింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి