iDreamPost

ఇష్టంగా రోడ్డుసైడ్ దొరికే షావర్మా తింటున్నారా? ఈ న్యూస్ చదివితే అసలు ముట్టరు!

Chicken Shawarma: చాలా మంది చికెన్ షావర్మాను ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా రోడ్డు సైడ్ దొరికే షావర్మాను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే అలా మీరు కూడా తింటున్నారా?. అయితే ఈ వార్త చదివితే అసలు ముట్టరు. అసలు ఏం జరిగిందంటే..

Chicken Shawarma: చాలా మంది చికెన్ షావర్మాను ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా రోడ్డు సైడ్ దొరికే షావర్మాను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే అలా మీరు కూడా తింటున్నారా?. అయితే ఈ వార్త చదివితే అసలు ముట్టరు. అసలు ఏం జరిగిందంటే..

ఇష్టంగా రోడ్డుసైడ్ దొరికే షావర్మా తింటున్నారా? ఈ న్యూస్ చదివితే అసలు ముట్టరు!

నేటికాలంలో చాలా మంది బయట ఆహారం తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా నాన్ వేజ్ కి సంబంధించిన ఫుడ్ ను బయట తినేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఈక్రమంలో రోడ్డు సైడ్ లభించే ఆహారం తీసుకుని కొందరు అస్వస్థతకు గరువుతుంటారు. ఇటీవల కాలంలో షావర్మా తిని చనిపోయినా, అస్వస్థతు గురైన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా చికెన్ షావర్మా విషయంలో మరో ఘోర చోటుచేసుకుంది. ఈ సారి ఏకంగా 12 మందిపై దీని ప్రభావం చూపింది. చికెన్‌ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మహారాష్ట్ర రాజధాని ముంబై లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముంబైలోని తూర్పు గోరేగావ్‌ ప్రాంతంలోని సంతోష్‌ నగర్‌లో శాటిలైట్‌ టవర్‌ వద్ద చికెన్‌ షావర్మా విక్రయిస్తున్నారు. అక్కడ అమ్ముతున్న షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో పలువురు అస్వస్థకు గురయ్యారు. మొత్తంగా ఇక్కడ చికెన్ షావర్మా తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు.

 అనారోగ్యానికి గురైన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు స్వప్నిల్ దహనుకర్, ముస్తాక్ అహ్మద్, సుజిత్ జైస్వాల్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగానే వీరు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇక షావర్మా తిన్న ఘటనలో బాధితుల తెలిపిన వివరాల ప్రకారం..ఆస్పత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక ఈ షావర్మాకు సంబంధించిన ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రోడ్డు సైడ్ తక్కువ ధరకు వస్తుండటంతో చాలా మంది తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొందరు నాణ్యతలేని, చెడిపోయిన మాంసాన్ని ఉపయోగిస్తుంటారు. ఈక్రమంలో అలాంటి చికెన్ షావర్మాను తిని ఏకంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గతంలోనూ కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చికెన్ షావర్మా తిని ప్రాణాలు కోల్పోయిన అలానే రోడ్డు సైడ్ దొరికే  కొన్ని నాణ్యత లేని  చికెన్ షావర్మా తిని ప్రజల ఆరోగ్యం క్షీణిస్తున్నాయని.

అలానే ఈ ఇష్యూపై వరుసగా వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వివిధ ప్రధాన నగరాలు, నగర కార్పొరేషన్ ఆరోగ్య అధికారులు సంబంధిత హోటళ్లను  తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాణ్యత పాటించిన వాటిని మూసివేయించారు. తాజాగా మరోసారి కూడా చికెన్ షావర్మ తిన్న 12 మంది ఆస్పత్రిపాలయ్యారు. ఇలా రోడ్డు సైడ్ దొరికే చికెన్ షావర్మాలు ఇష్టంగా తినే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు, పలువురు సూచిస్తున్నారు. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి