iDreamPost

క‌రోనా లాభాలు న‌ష్టాలు

క‌రోనా లాభాలు న‌ష్టాలు

క‌రోనాతో లాభాలు, న‌ష్టాలు రెండూ ఉన్నాయి.

లాభాలుః

1.ప్ర‌కృతితో గెల‌వ‌డం అంత సుల‌భం కాద‌ని, ప్ర‌కృతి నాశ‌నంతో త‌న నాశ‌నం కూడా ఉంద‌ని మ‌నిషికి మ‌ళ్లీ తెలిసింది.
2.క‌ర్భ‌నంతో నిండిపోయిన గాలిలో స్వ‌చ్ఛ‌త వ‌స్తోంది.
3.పాము, పిల్లి, కుక్క‌, క‌ప్ప‌, గ‌బ్బిలం ఇలా ప్ర‌తి ప్రాణిని తిన‌డం చైనావాళ్ల అల‌వాటు. మ‌నిషిని ఎందుకు తిన‌రంటే, ఫ్యాక్ట‌రీల్లో ప‌నిచేయ‌డానికి అవ‌స‌రం కాబ‌ట్టి. క‌రోనా దెబ్బ‌తో చైనాలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో ప్రాణుల‌కి జీవిత కాలం పెరిగింది.
4.ప‌క్క‌వాడి నెత్తిన చేతులు పెట్ట‌డం త‌ప్ప‌, చేతులు క‌డిగే అల‌వాటు లేని జ‌నానికి (ముఖ్యంగా మ‌న దేశంలో) ఆ అల‌వాటు నేర్పింది.
5.రాజ‌కీయ నాయ‌కులు జ‌నంలో తిర‌గ‌డం త‌గ్గ‌డం వ‌ల్ల కాలుష్యం త‌గ్గింది.
6.బ‌యోమెట్రిక్ తీసేయ‌డం వ‌ల్ల ఆఫీస్‌కి లేటుగా వెళ్లొచ్చు.
7.కొన్ని ప్రాంతాల్లో థియేట‌ర్లు మూసేయ‌డం వ‌ల్ల మాన‌సిక చైత‌న్యం పెరిగింది.
8.శుభ్ర‌త దేవుడి ప్ర‌తిరూపం అంటారు. శుభ్రం ఉండ‌క‌పోతే నేరుగా ఆ దేవుని ద‌గ్గ‌రికే వెళ్తాం. ఈ స‌త్యాన్ని మున్సిపాలిటీ వాళ్లు కూడా గుర్తించి వీధులు శుభ్రం చేస్తున్నారు.
9.ఇంటికి బంధువులు రారు.
10.శ‌త్రువుల్ని భ‌య‌పెట్ట‌డానికి ఆయుధం అక్క‌ర్లేదు. గ‌ట్టిగా తుమ్మినా, ద‌గ్గినా చాలు.

న‌ష్టాలుః

1.పానీపూరీని ధైర్యంగా తినలేం. చికెన్ మ‌రిచిపోవాల్సిందే.
2.ఆల్రెడీ ముఖాల‌కి మాస్కుల‌తో బ‌తుకుతుంటే , మ‌ళ్లీ ముక్కుకి మాస్క్ వేసుకోవాలంటే ఇబ్బంది.
3.థియేట‌ర్ల‌కి వెళ్ల‌క‌పోవ‌డంతో టీవీ సీరియ‌ల్స్ చూసి , పైత్యం ప్ర‌కోపించే అవ‌కాశం.
4.ప‌క్క‌వాడికి హ్యాండ్ ఇచ్చే అవ‌కాశం కోల్పోతాం.
5.మన వీధిలో వాడు చీదినా, మ‌న‌ల్ని తీసుకెళ్లి ఐసోలేష‌న్‌లో వేస్తారు.
6.షేవింగ్ స్వ‌యంగా చేసుకుని ర‌క్త గాయాల‌కి గురి కావ‌డం (బార్బ‌ర్ షాప్‌కి వెళ్లాలంటే భ‌యం కాబ‌ట్టి)
7.షేర్ ఆటో, షేర్ క్యాబ్‌లు ఎక్క‌లేని స్థితి. క‌రోనా కూడా షేరు అవుతుంది కాబ‌ట్టి.
8.కొన్న షేర్ల‌న్నీ కుప్ప‌కూలి దివాళా తీయ‌డం
9.ఎవ‌డికి ఫోన్ చేసినా భ‌యంక‌ర‌మైన ద‌గ్గు వినాల్సి రావ‌డం.
10.ఇంటిని త‌ప్పించుకుని ఆఫీస్‌కి వెళితే, Work From Home అని చెప్ప‌డం (సాఫ్ట్‌వేర్‌కి మాత్ర‌మే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి