iDreamPost

కరోనా ఎఫెక్ట్ -ఐపీఎల్ వాయిదా

కరోనా ఎఫెక్ట్ -ఐపీఎల్  వాయిదా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ధాటికి పలు భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడ్డాయి. దాంతో పాటుగా పలు అంతర్జాతీయ క్రీడలు కూడా వాయిదా పడుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒలింపిక్స్ నే వాయిదా వేయాలని జపాన్ ప్రభుత్వం ఆలోచిస్తుందంటే కరోనా ప్రభావం ప్రపంచ దేశాలపై ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఒలింపిక్స్ ని వాయిదా వేయాల్సిందిగా జపాన్ ప్రభుత్వాన్ని కోరారు.

తాజాగా బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఐపీఎల్ కు కరోనా సెగ తగిలింది. టోర్నీని నిర్వహించడానికి పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ నెల 29 న ప్రారంభమవ్వాల్సిన ఐపీఎల్ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు భారత ప్రభుత్వం కరోనా వైరస్ భయంతో విదేశీ వీసాలను ఏప్రిల్ 15 వరకూ రద్దు చేసిన విదేశీ స్టార్ క్రికెటర్లు ఐపీఎల్ లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

దాంతో ఫ్రాంచైజీలన్నీ రెండువారాలపాటు ఐపీఎల్ ని వాయిదా వేయాల్సిందిగా బీసీసీఐని కోరడంతో ఐపీఎల్ వాయిదాకు బీసీసీఐ అంగీకారాన్ని తెలిపింది.. దాంతో ఈ నెల 29 న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మ్యాచులు ఏప్రిల్ 15 నుండి ప్రారంభం కానున్నాయి. కాగా మహారాష్ట్ర , కర్ణాటక, ఢిల్లీ ప్రభుత్వాలు క్రికెట్ మ్యాచుల నిర్వహణను వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ వైరస్ వ్యాప్తి ఎక్కువైన నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు నిర్వహణకు ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

భారత్ లో తొలి కరోనా వైరస్ మరణం నమోదవడంతో భారత ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలుగా థియేటర్లు, స్కూల్స్, కాలేజీలు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి