iDreamPost

డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు.. తాను గెలవకపోతే రక్తపాతమే అంటూ..

Donald Trump- Joe Biden: డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ర్యాలీలో ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రక్తపాతం జరుగుతుంది అంటూ హెచ్చరించారు.

Donald Trump- Joe Biden: డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ర్యాలీలో ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రక్తపాతం జరుగుతుంది అంటూ హెచ్చరించారు.

డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు.. తాను గెలవకపోతే రక్తపాతమే అంటూ..

అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చున్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ తనకు ఓట్లు వేయకపోతే అమెరికాలో రక్తపాతం జరుగుతుంది అంటూ వ్యాఖ్యానించారు. నవంబర్ 5న జరగబోయే ఎన్నికలు అమెరికా చరిత్రలో నిలిచిపోతాయంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇంకోసారి బైడెన్ అధికారంలోకి వస్తే.. ఇంక అమెరికాలో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండదు అంటూ వ్యాఖ్యానించారు. ఒహైయోలి జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్- డొనాల్డ్ ట్రంప్ మధ్య యుద్ధం జరగనుంది. నవంబరులో వీరు అధ్యక్ష ఎన్నికల్లో తలపడతారు. డెమాక్రాటిక్ పార్టీ నుంచి బైడెన్, రిపబ్లిక్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధుల మద్దతు గెలుచుకున్నారు. డొనాల్డ్ ట్రంప్- జో బైడెన్ మధ్య మాటల యుద్ధం మొదలైపోయింది. ఎన్నికలు నవంబర్ 5నే అయినా ఎన్నికల ప్రచారాలు మాత్రం జోరందుకున్నాయి. ఒహైయోలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. మెక్సికోలో చైనా కార్ల తయారీ కంపెనీ ఏర్పాటు చేయాలి అనుకుంటున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండంచారు. తాను అధికారంలోకి వస్తే.. ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే కార్లను అమెరికాలో అమ్మేందుకు అనుమతి ఇవ్వనంటూ కుండబద్దలు కొట్టేశారు. ఆ కార్లపై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తానంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో పరోక్షంగా జోబైడెన్ వాహన పాలసీని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు.

ట్రంప్ వ్యాఖ్యలతో మరోసారి విధ్వంసం జరుగుతుంది అంటూ జోబైడెన్ ప్రచార కమిటీ వ్యాఖ్యానించింది. ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యలను వాళ్లు ఖండించారు. గత ఎన్నికల్లో ట్రంప్ ఘోర పరాజయాన్ని మర్చిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నారు. మరోసారి ఆయన వ్యాఖ్యలతో రాజకీయ హింసను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచార కమిటీ అధికార ప్రతినిధి ట్రంప్ వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను తగ్గించే ప్రయత్నం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు. మరోసారి బైడెన్ అధికారంలోకి వస్తే.. వాహన పరిశ్రమలో ఆర్థిక రక్తపాతం జరుగుతుంది అని చెప్పడమే ట్రంప్ ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే సొంత పార్టీ కీలక నేత మైక్ పెన్స్.. డొనాల్డ్ ట్రంప్ కు తన మద్దతు లేదంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ అభ్యర్థిత్వానికి తన మద్దతు లేదని స్పష్టం చేశారు. తనకు, ట్రంప్ కు చాలా తేడా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. క్యాపిటల్ హిల్ పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసినప్పుడు కూడా మైక్ పెన్స్ ఖండించిన విషయం తెలిసిందే. ట్రంప్ మాట్లాడుతూ.. క్యాపిటల్ హిల్ దాడి ఘటనలో జైలుపాలైన వారిని బందీలు, దేశభక్తులు అంటూ ట్రంప్ అభివర్ణించడాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి