iDreamPost

కరోనా ఎఫెక్ట్ – ఢిల్లీలో 144 సెక్షన్ అమలు

కరోనా ఎఫెక్ట్ – ఢిల్లీలో 144 సెక్షన్ అమలు

అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే అనేక ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా నేటి నుండి మార్చ్ 31వరకు ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తు ఉత్తర్వులు జారీ చెసింది.

ఢిల్లీ పోలీస్ యాక్ట్ 1978 సెక్షన్ 35 ప్రకారం తమ కున్న అధికారాలను ఉపయోగించి ఈ ఉత్తర్వులు జారీ చేస్తునట్టు, అవసరమైతే తప్ప ర్యాలీ, నిరసనలు , వినోదాలు, కాలక్షేపం కోసం బయటికి రావద్దని పొలీస్ కమీష్నర్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమీష్నర్ హెచ్చరించారు.

ఇప్పటికే ఢిల్లీలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పెట్టిన ఈ ఆంక్షలతో ఢిల్లీ వాసులు ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే నాగపూర్, ముంబైల్లో అమలులో ఉన్న 144 సెక్షన్ ఇప్పుడు ఢిల్లీ కూడా అమలు చేయటంతో రాబోయే రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తి బారిన పడకుండా ఉండేందుకు దేశంలో మరికోన్ని రాష్ట్రాలు కూడా ఇదే బాట పట్టే అవకాశం లేకపోలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి