iDreamPost

కరోనా వైరస్ లాంటిది వస్తుందని ముందే ఊహించి తీసిన సినిమా “Contagion”

కరోనా వైరస్ లాంటిది వస్తుందని ముందే ఊహించి తీసిన సినిమా “Contagion”

కరోనా background లో ప్రపంచ వ్యాప్తంగా ఆ వైరస్ spread అయిన పరిస్థితుల్లో చూడవలసిన సినిమా ఇది.. ఈ సినిమా 2011 లో వచ్చింది.. అంతకు కొన్ని ఏళ్ల ముందే వచ్చిన H1N1, Sars లాంటి pandemic లు చూసి అలాంటి సినిమా తియ్యాలనిపించి దర్శకుడు Steven Soderbergh తీశాడిది.. మొదట కొంతసేపు చూసి Robin Cook నవల ఏదైనా తీశారా ఈ సినిమాగా అనుకున్నా. కానీ ఇది వేరేగా, independent గా తీశారు. కానీ Robin Cook నవలల్లో ఒకట్రెండు కొంచెం ఇలాగే ఉంటాయి..

సినిమా మొదట్లోనే హాంకాంగ్, చైనా లాంటి ప్రాంతాల్లో కొన్ని అలసటతో నిండిన మొహాలు తమ తమ పనుల మీద తప్పనిసరిగా తిరుగుతూ కనిపిస్తాయి. తర్వాత వాళ్ళు కుప్పకూలడం చూపిస్తారు..
అమెరికాలోని మిన్నియాపోలిస్ కి చెందిన Beth Emhoff (Gwyneth Paltrow) బిజినెస్ పని మీద హాంకాంగ్ వెళ్లి తన ఇంటికి తిరిగి వస్తుంది. వచ్చిన వెంటనే అంతు బట్టని వ్యాధితో seizures వచ్చి నురగలు కక్కుతూ మరణిస్తుంది.. Encephalitis కావచ్చంటారు డాక్టర్లు..అటాప్సీ చేయిద్దామంటారు. ఆమె శరీరం ఆసుపత్రిలో ఉండగానే ఆమె భర్త Mitch (Matt Damon) ఇంటికి వస్తుండగా కొడుకు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడని baby sitter ఫోన్ చేస్తుంది.. అతను ఇంటికొచ్చే లోగానే పిల్లాడు కూడా మరణిస్తాడు.. Beth కి హాంకాంగ్ లో ఆ వైరస్ అంటుకుందని తర్వాత తెలుస్తుంది. అక్కడ ఎలా అంటుకుందో background మనకి సినిమా చివర్లో చూపిస్తారు..

ఇంకా ఇలాంటి వ్యాధి జపాన్, చైనాల్లోనూ, తర్వాత మిగిలిన దేశాల్లోనూ కూడా వేగంగా వ్యాపిస్తుంది.. దీనికి ఎలాంటి చికిత్స గానీ, వాక్సిన్ గానీ ఉండవు..అట్లాంటాలో Health department సైంటిస్టులు వైరస్ కి వాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాలు మొదలుపెడతారు. వైరస్ లో గబ్బిలం, పంది.. ఈ రెండింటి జీన్స్ కనబడ్డం వల్ల వాక్సిన్ తయారీ ఆలస్యమవుతుంది..

ఈలోగా Minneapolis లో దీని వ్యాప్తిని, severity ని తగ్గించడానికి, వీలైతే contain చెయ్యడానికి వచ్చిన సైంటిస్ట్ Erin Mears (Kate Winslet)కూడా అక్కడ వైరస్ అంటుకుని మరణిస్తుంది. అంతకు ముందు ఆమె ఆ నగర పాలక సంస్థ అధికారులతో మాట్లాడినప్పుడు అది Thanks giving పండగ టైం కాబట్టి షాపులు etc మూసెయ్యడానికి ఇష్టపడకపోవడం, ఆ పాలిటిక్స్, తర్వాత వ్యాధి వ్యాప్తి పెరగడంతో జనం సరుకులు hoarding చెయ్యడం, సరుకులు దొరక్క rioting, లూటీలు etc లన్నీ జరుగుతాయి.

ఇలాంటి conspiracy లు, sensational విషయాలు blog లో రాసే Alan Krumweide (Jude Law) health department వాళ్ళని, ప్రభుత్వాన్ని తన బ్లాగ్ లో తిట్టి పోస్తుంటాడు.. తనకి ఈ వైరస్ వచ్చిందనీ, Forsythia అనే హోమియో మందు వేసుకుంటే తగ్గిపోయిందనీ అబద్ధం చెప్పి బ్లాగ్ లో ప్రచారం చేస్తాడు.. దాంతో ఆ మందుకి విపరీతంగా డిమాండ్ పెరిగి దాని కోసం మెడికల్ షాపుల్లో లూటీలు జరుగుతాయి. ఈలోగా Krumweide ఈ మందు పేరుతో మార్కెట్లో బోలెడు డబ్బు సంపాదిస్తాడు.. ఫార్మా కంపెనీలు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్ని సొమ్ము చేసుకోవడం.. ఇవన్నీ కూడా ప్రస్తావనకి వస్తాయి..

మొత్తానికి Beth కేసుతో మొదలై ఈ వ్యాధి వేగంగా, విపరీతంగా వ్యాపించి మొత్తం అమెరికాలో రెండు మిలియన్ల మంది, ప్రపంచ వ్యాప్తంగా పాతిక మిలియన్ల మంది మరణిస్తారు.. ఈలోగా దానికి వాక్సిన్ కనుక్కుంటారు…దాన్ని ఎక్కువగా తయారు చేసి పుట్టిన తేదీ ప్రకారం వరసగా ఇస్తూ వస్తారు. ఆ రకంగా అందరికీ వాక్సిన్ దొరికేసరికి చాలా నెలలు పడుతుంది..

మరో ప్రక్క ఇలాంటి సమయాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేసే ప్రయత్నాలు, కృషి చూపిస్తారు. WHO కి చెందిన సైంటిస్టు (epidemiologist) Leonora (Marion Cotillard) హాంకాంగ్ లో ఈ వ్యాధి ఎలా మొదలైందో తెలుసుకోవడానికి వెళ్తుంది. అక్కడ local గా చాలా మందికి ఇది వచ్చి చనిపోతుంటారు.. అమెరికా, యూరప్ దేశాలు దీనికి వాక్సిన్ కనుక్కుని ముందు వాళ్ళు తీసుకుంటారనీ, తమకి ఇవ్వరనీ అనుమానంతో Leonora ని అక్కడి వాళ్ళు కిడ్నాప్ చేసి ముందు తమకి వాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇలా చాలా చోట్ల జరగడంతో అలా కిడ్నాప్ లు చేసిన వాళ్ళకి placebo డోసులు (మందు లేకపోయినా మందులా భ్రమ కలిగించే ఉట్టి మాత్రలు, వాక్సిన్లు) ఇస్తారు. ఇది చూసినప్పుడు నిజంగా తల తిరిగి పోతుంది.. ఇలా ఎన్ని జరుగుతున్నాయో మనకి తెలీకుండా అని..

మొత్తానికి చివర్లో దీనికి వాక్సిన్ కనుక్కుని సుఖాంతం అయినట్టు చూపించినా.. అసలు ఆ వాక్సిన్ కి ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉన్నాయో, అవి ఎన్నేళ్ల తర్వాత బయట పడతాయో, గతంలో కూడా అలా జరిగింది కదా.. ఈ అనుమానాలన్నీ Krumweide మనలో రేకెత్తిస్తాడు..

ఈ సినిమా కేవలం ఒక వైరస్ spread అయి మనుషులు అసంఖ్యాకంగా మరణించడం గురించి మాత్రమే కాదు. అలాంటి pandemic ని కూడా మనుషుల్లో స్వార్థపరులు తమ సొంత ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకుంటారు? ఇలాంటి మహమ్మారి వ్యాపించినప్పుడు ప్రజలంతా mass hysteria తో మందులు వాక్సిన్ల కోసం ఎలా కొట్టుకోవడాలు, చంపుకోవడాలకి దిగుతారు? Social disorder, అంటే సామాజికంగా అరాచకం, ఘర్షణలు ఎలా ప్రబలుతాయి? అనేవాటిని చూపించడానికి ప్రయత్నించారు.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో విషయాలు సినిమా రూపం దాల్చినట్టు అనిపిస్తుంది ఇది చూస్తే..

ఇక ఈ pandemic లు ఎలా మొదలవుతాయనేది ఇంకో పెద్ద ప్రశ్న. ఇప్పుడు కరోనా వైరస్ గురించి అమెరికా, చైనాలు కొట్టుకుంటున్నాయి కదా. దాన్ని bio weapon గా ఉపయోగించారని ఒక దాని మీద ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి.. అందులో నిజం ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది అనేవి మనలాంటి మామూలు ప్రజలకి ఎప్పటికీ తెలీవు.. కానీ వాటి వల్ల పిట్టల్లా రాలిపోయేదీ, లేదా పనులన్నీ ఆగిపోయి నష్టపోయేదీ మనమే..
అలాగే జర్మనీలో ఓ కంపెనీ కరోనా కి వాక్సిన్ తయారు చేసిందనీ, ఆ కంపెనీని కొనెయ్యడానికి ట్రంప్ ప్రయత్నించారనీ జర్మనీ ఆరోపణలు చేసిందని వార్తలు చదివాం నిన్ననే.. ఇంకా మెర్కెల్, ట్రంప్ లు దీని మీద కొట్టుకుంటూనే ఉన్నారు..

సినిమా Prime లో ఉంది. ఒకసారి చూడండి. చూసి panic అవాలని కాదు గానీ ఇలాంటి pandemic ల టైంలో ఏం చెయ్యాలి? ఏం చెయ్యకుండా ఉంటే మంచిది? వీటి వెనక ఎన్ని సమస్యలు, కుట్రలు, స్వార్థ ప్రయోజనాలు ఉంటాయో స్పష్టంగా తెలుస్తుంది..

దీని దర్శకుడు Soderbergh ఇది తీయక ముందే Erin Brackovitz, Ocean’s trilogy, ఇంకా కొన్ని సినిమాలు తీసి ఫేమస్ అయిన వ్యక్తి.. కాబట్టి సినిమా బాగానే ఉంటుంది. కానీ అక్కడక్కడ సీన్లు disjointed గా ఉండి కథ కనెక్ట్ అవనట్టుగా అనిపిస్తుంది. కానీ ఇలాంటి టాపిక్ ని అంతకంటే బాగా అర్థమయ్యేలా తియ్యడం కష్టం.. అందుకే కథ చాలా మటుకు చెప్పేశానిక్కడ. కానీ వైరస్ ఎలా మొదలైందని చూపించాడో చెప్పలేదు చూసేవాళ్ల కోసం..

By the way, మనం normal గా రోజుకి సగటున కనీసం మూడు వేల సార్లు చేతులతో ముఖాన్ని తాకుతాం.. ఇది ఈ సినిమా ద్వారా కలిగిన ఙ్ఞానం. (రైటే కావచ్చు) అంచేత ఎంత తగ్గించుకున్నా కష్టమేమో ఆపడం..

Written By – Usha Rani Akella

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి