iDreamPost

నడిరోడ్డుపై లారీ డ్రైవర్ ను డ్రాయర్‌పై నిలబెట్టి.. దారుణం! ఎక్కడంటే?

Lorry Driver Issue: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణా జరగుతుందని పోలీసుల నిఘా పెంచారు. ఈ క్రమంలోనే ఇద్దరు కానిస్టేబుల్స్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Lorry Driver Issue: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణా జరగుతుందని పోలీసుల నిఘా పెంచారు. ఈ క్రమంలోనే ఇద్దరు కానిస్టేబుల్స్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నడిరోడ్డుపై లారీ డ్రైవర్ ను డ్రాయర్‌పై నిలబెట్టి.. దారుణం! ఎక్కడంటే?

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక రవాణా సర్వ సాధారణం అయ్యింది. కొంతమంది నిబంధనలకు నీళ్లొదిలి యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న విషయం తెలిసిందే. అధికారులు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా.. ఎదో ఒక రూపంలో ఈ దందాలు కొనసాగిస్తున్నారు. కోట్ల రూపాయలకు గండి పడుతున్నా కొంతమంది అధికారులు, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్, మహబూబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఇక్కడ గట్టి నిఘా పెంచారు. ఓ లారీ డ్రైవర్ పై పోలీసులు చర్యపై విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

ఓ లారీ డ్రైవర్ పై పలు ఆరోపణలు చేస్తూ అతన్ని నడి రోడ్డుపై బట్టలు విప్పేసి.. డ్రాయర్ మీద నిలబెట్టి కొట్టిన దృశ్యాలో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ దృష్టికి రావడంతో సదరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. అసలు ఏం జరిగిందంటే.. గత వారం కేసముద్రం ఫ్లై ఓవర్ వద్ద ఇసుక లోడ్ తో వస్తున్న లారీని పక్కకు ఆపాలని సాంబయ్య, వీరన్న అనే కానిస్టేబుళ్లు లారీ డ్రైవర్ ని అడిగారు. కానీ అతడు వీళ్ల మాట పట్టించుకోకుండా కొంచెం దూరం వెళ్లాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కానిస్టేబుళ్లు డ్రైవర్ ని కిందకు దింపి ఒంటిపై బట్టలు విప్పించారు. డ్రయర్ తో నడిరోడ్డుపై నిలబెట్టడమే కాకుండా బండబూతులు తిడుతూ కొట్టారు.

ఈ విషయాన్ని అక్కడ ఉన్న కొంతమంది పోలీస్ కానిస్టేబుళ్లను ప్రశ్నించగా.. మద్యం సేవించి లారీ నడుపుతున్నాడని, అడిగితే అద్దాలు పగలగొట్టారని డ్రైవర్ పై ఆరోపణలు చేశారు. మద్యం సేవిస్తే బ్రీత్ అనలైజర్ టెస్టు చేయాలి పట్టుబడితే ఫైన్ వేయాలి.. ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. బ్రీత్ అనలైజర్ పని చేయడం లేదని దాటవేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంతమంది ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పోలీసులు వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంలో అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా ఇద్దరు కానిస్టేబుల్స్ లారీ డ్రైవర్ వద్ద అడ్డగోలు వసూళ్లు చేస్తున్నారని..ఎదురు తిరిగితే వారిపై దాడులు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి