iDreamPost

తల్లిదండ్రుల కోసం గుడి కట్టిన కొడుకులు.. ప్రతిరోజూ..

  • Published Feb 03, 2024 | 11:56 AMUpdated Feb 03, 2024 | 11:56 AM

A Temple for Parents: కనీ పెంచిన తల్లిదండ్రులను చివరి రోజుల్లో పట్టించుకోని ఈ కాలంలో తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారికి గుడి కట్టి పూజిస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు..

A Temple for Parents: కనీ పెంచిన తల్లిదండ్రులను చివరి రోజుల్లో పట్టించుకోని ఈ కాలంలో తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారికి గుడి కట్టి పూజిస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు..

  • Published Feb 03, 2024 | 11:56 AMUpdated Feb 03, 2024 | 11:56 AM
తల్లిదండ్రుల కోసం గుడి కట్టిన కొడుకులు.. ప్రతిరోజూ..

తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు.. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ అని పూజిస్తుంటారు. నవమాసాలు మోసి ఎన్నో బాధలు పడి పిల్లలకు జన్మనిస్తుంది తల్లి, పుట్టినప్పటి నుంచి వారు ప్రయోజకులయ్యేవరకు వెన్నంటి ఉంటారు తండ్రి. అలాంటి తల్లిదండ్రులను చివరి రోజుల్లో కంటికి రెప్పలా సాకాల్సిన పిల్లలు వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చివరి రోజుల్లో వృద్దాశ్రమాలకు తరలిస్తున్నారు. తలిదండ్రులు సంపాదించిన ఆస్తులపై ఉన్న ఆశ వారికి బుక్కెడు బువ్వ పెట్టడానికి మాత్రం లేదని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. అలాంటి ఈ రోజుల్లో చనిపోయిన తల్లిదండ్రులకు గుడి కట్టించి నిత్యం పూజలు చేస్తున్నారు కొడుకులు. వివరాల్లోకి వెళితే..

తమ పిల్లలు సమాజంలో ఉన్నతమైన పొజీషన్లో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకోసం అహర్శిశలూ కష్టపడుతుంటారు. ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయిలో ఉండటానికి ఎండా.. వాన లేక్కచేయకుండా కష్టపడి చదివిస్తారు. తమ కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు నింపుతారు.. పిల్లల బంగారు భవిష్యత్ కోసం తమ రెక్కలు ముక్కలు చేసుకుంటారు. అలాటి తల్లిదండ్రులు వృద్దులైన తర్వాత కొంతమంది పుత్రరత్నాలు ఇంటి నుంచి గెంటి వేయడం.. ఒక్క పూట అన్నం పెట్టడానికి వంతులు వేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తమ పిల్లల్ని చిన్నప్పటి నుంచి లాలించి.. అల్లారుముద్దగా చూసుకున్న తల్లిదండ్రులను చివరి రోజుల్లో వృద్దాశ్రమానికి సాగనంపుతుంటారు. అలాంటి ఈ రోజుల్లో ఇద్దరు అన్నదమ్ములు తమ తల్లిదండ్రులకు ఇచ్చిన గౌరవం చూస్తే చెతులెత్తి మొక్కుతారు.

మహబూబాబాద్ పట్టణ శివారు అనంతారం గ్రామానికి చెందిన పెరమాళ్లపల్లి శేషయ్య-ఎల్లమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిని తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ ఎంతో కష్టపడి కంటికి రెప్పలా సాకారు.. ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కొడుకు వెంకట్ ఈఎస్ఐ హాస్పిటల్ లో ఫార్మసిస్టుగా పని చేస్తున్నారు. రెండవ కుమారుడు విజయ్ విద్యుత్ శాఖలో డీఈగా, చిన్న కుమారుడు జనార్థన్ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. తమను చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రులకు గొప్పగా ఏదో ఒకటి చేయాలని భావించారు అన్నదమ్ములు. ఈ క్రమంలోనే అనంతారం గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ పొలంలో ప్రత్యేకంగా గుడి నిర్మించి అందులో తల్లిదండ్రు విగ్రహాలను ప్రతిష్టించారు. తల్లిదండ్రుల జయంతి, వర్దంతి, పండుగలు, ఇతర శుభకార్యాల సమయంలో అక్కడికి వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ప్రతిరోజూ గుడికి దండం పెట్టుకుంటారు. తల్లిదండ్రులకు గుడి కట్టి పూజిస్తున్న అన్నదమ్ములను చూసి గ్రామస్థులు ఎంతో గర్విస్తున్నామని.. ఇలాంటి కొడుకులను కన్న ఆ తల్లిదండ్రులు అదృష్టవంతులని అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి