iDreamPost

కాంగ్రెస్ కు తన అవసరం లేదంటున్న పీకే.. అసలు ఉద్దేశం ఏమిటీ..?

కాంగ్రెస్ కు తన అవసరం లేదంటున్న పీకే.. అసలు ఉద్దేశం ఏమిటీ..?

వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనని.. వ్యూహకర్తగా మాత్రమే కొనసాగుతానని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాహుల్, ప్రియాంకల గురించి ఆయన కామెంట్ చేశారు. గురువారం ఆయన ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన నాయకత్వ సూత్రంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లేరని ప్రశాంత్ తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వంలో మూడో పేరు ఉందా అని ప్రతినిధి ప్రశ్నించిన సమయంలో పీకే ఇలా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం గురించి చర్చలు జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పీకే అవసరం లేదు.. ఆ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోగలదన్నారు.

ఇటీవల కాంగ్రెస్ లో పీకే గురించి చర్చ జరుగుతోంది. మీడియా కూడా దాని గురించే ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ స్పందించారు. మీడియా తన గురించి ఎక్కువ చెబుతుందన్నారు. తన స్థాయి, పాత్ర అంత పెద్దది కాదని చెప్పారు. తన కన్నా రాహుల్ గాంధీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి పీకే అవసరంలేదని చెప్పారు. తన సొంత నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే తాను చెప్పాల్సింది చెప్పానని.. తాను పనిచేయాలా వద్దా అనేది పూర్తిగా వారి అభీష్టం మేరకు ఉంటుందని తెలిపారు. నిజానికి పీకే గురించి హాట్ టాపిక్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా చేస్తారా.. పార్టీలో చేరతారా అనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రాహుల్, ప్రియాంకను తగ్గించినట్టు అనిపించింది. దీంతో పీకే ఆ అంశం గురించి మాట్లాడారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి