iDreamPost

కాంగ్రెస్‌కు లెఫ్ట్ పార్టీలతో కుదిరిన పొత్తు!.. సీపీఎం, సీపీఐలకు చెరో రెండు సీట్లు!

కాంగ్రెస్‌కు లెఫ్ట్ పార్టీలతో కుదిరిన పొత్తు!.. సీపీఎం, సీపీఐలకు చెరో రెండు సీట్లు!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న వేళ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. మరో వైపు అధికార పార్టీ బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఎలక్షణ్ కమిషన్ తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. తెలంగాణలో నవంబర్30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల పొత్తులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు కుదిరినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో లెఫ్ట్ పార్టీలైన సీపీఎం, సీపీఐ పొత్తు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ పొత్తులో సీపీఐకి రెండు స్థానాలు, సీపీఎంకి రెండు స్థానాలు కాంగ్రెస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు స్థానాలు, సీపీఎంకి భద్రాచలం, మిర్యాలగూడ స్థానాలు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ పొత్తులపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఆ నియోజక వర్గాల్లో వామపక్షాల బలబలాలపై సర్వే చేసిన నిర్వహించిన కాంగ్రెస్ పలు చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తుకు సంబంధించి రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి