iDreamPost

Acharya : రాజమౌళి చేతిలో విడుదల మంత్రం

Acharya : రాజమౌళి చేతిలో విడుదల మంత్రం

ఈ రోజు అంటే జనవరి 7 రావాల్సిన ఆర్ఆర్ఆర్ వాయిదా పడితే పడింది కానీ ఇంకో నెల కన్నా ముందే ఆచార్య వస్తుంది కాబట్టి మెగా ఫ్యాన్స్ దాన్ని చూసుకుందామని మంచి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. కానీ వాటి మీద కూడా నీళ్లు చల్లేలా ఉన్నాయి పరిస్థితులు. కారణాలు మూడు. మొదటిది ఆర్ఆర్ఆర్ రిలీజయ్యాకే ఆచార్య రావాలన్న కండీషన్ మీదే రాజమౌళి తన హీరో రామ్ చరణ్ ని కొరటాల శివకు ఇచ్చారన్న వార్త అప్పట్లోనే వచ్చింది. ఆ లెక్కన చూస్తే ట్రిపులార్ ఏప్రిల్ కన్నా ముందే వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. అది కూడా సర్కారు వారి పాట, బీస్ట్ లాంటి ఇతర పాన్ ఇండియా సినిమాల షెడ్యూల్స్ మీద ఆధారపడి ఉంటుంది.

ఇక రెండో రీజన్ కరోనా మూడో వేవ్. కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రాణాపాయం తక్కువగా ఉన్నప్పటికీ దీన్ని మరీ నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఇంకో నెలరోజులకు పైగా ఇదే సిచువేషన్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలో ఆంక్షలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇవన్నీ వచ్చే 4కు కుదురుకుంటాయన్న గ్యారెంటీ లేదు. అదే జరిగితే ఆచార్య వచ్చినా ప్రయోజనం ఉండదు. ఇక మూడో కారణం ఏపిలో టికెట్ రేట్ల ఇష్యూ. అది తీరే వరకు టాలీవుడ్ పెద్ద సినిమాలేవీ రిలీజ్ కు సుముఖంగా లేవు. అఖండ, పుష్ప తరహాలో రిస్క్ తీసుకుని లాభపడేందుకు ఇష్టపడటం లేదు.

సో ఒకవేళ రాజమౌళి అప్పుడు అనుకున్న ఒప్పందం పాటించే తీరాలి అంటే ఆర్ఆర్ఆర్ తర్వాత రావడం తప్ప వేరే మార్గం ఉండదు. లేదు పర్లేదు అనుకుంటే ముందే వచ్చేయొచ్చు. ప్రస్తుతానికి ఆచార్య ఫిబ్రవరి 4 రావడం అనుమానమే. పెండింగ్ ఉన్న కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని దర్శకుడు కొరటాల శివ పూర్తి చేయించే పనిలో ఉన్నారు. ఇప్పటికే మూడు పాటలు వచ్చేశాయి. ఇంకో రెండు త్వరలో ప్లాన్ చేశారు. ఇటీవలే ట్రైలర్ కట్ ని మెగాస్టార్ ఫైనల్ చేశారట. పండగ అయ్యాక ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తానికి వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ ఇలా ఆచార్య మీద ఉండటమే ట్విస్ట్

Also Read : Bangarraju : వలిమై అవుట్ – బంగార్రాజుకు భలే టైం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి