iDreamPost

కోల్డ్ కేస్ రిపోర్ట్

కోల్డ్ కేస్ రిపోర్ట్

తెలుగులో ఈ మధ్య డైరెక్ట్ ఓటిటి రిలీజుల హడావిడి తగ్గింది కానీ మలయాళంలో ఇవాళ కోల్డ్ కేస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలయ్యింది. మనకూ అంతో ఇంతో పరిచయమున్న పృథ్విరాజ్ సుకుమారన్ హీరో కావడంతో పాటు ట్రైలర్ లో ఇదో ఇంటెన్సిటీ ఉన్న క్రైమ్ కం హారర్ థ్రిల్లర్ అని ఇంప్రెషన్ వచ్చేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. అందుకే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ సహాయంతో అయినా సరే దీన్ని చూద్దామనుకున్న తెలుగు ప్రేక్షకులు లేకపోలేదు. దానికి తోడు వేరే కొత్త కంటెంట్ ఎందులోనూ లేకపోవడం కూడా దీనికి కలిసి వచ్చింది. మరి ఈ మాత్రం అంచనాలైనా ఉన్న ఈ కోల్డ్ కేస్ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

ఊరవతల ఓ చెరువు దగ్గర ఎప్పుడో హత్య కాబడిన ఓ అమ్మాయి కపాలం దొరుకుంది. అదెవరిదో కనుక్కునేందుకు రంగంలోకి దిగుతాడు ఏసిపి సత్యజిత్(పృథ్విరాజ్). మరోవైపు మీడియా జర్నలిస్ట్ పద్మజ(అదితి బాలన్)తన పాపతో కలిసి ఓ పాత ఇంట్లో అద్దెకు దిగుతుంది. అక్కడికి వెళ్ళాక ఆ ఇద్దరికీ అక్కడ ఏదో దెయ్యం ఉన్నట్టు అనుమానం కలుగుతుంది. ఈ క్రమంలో కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న సత్యజిత్ కు కొన్ని కీలకమైన క్లూస్ దొరుకుతాయి. చంపబడ్డ యువతి తాలూకు మనుషులు తారసపడతారు. అసలు ఈ మర్డర్ కి పద్మజ చేరిన ఇంటికి ఉన్న లింక్ ఏంటి. నిజంగా దెయ్యం ఉందా, హంతుకుడు ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానమే అసలు కథ

ఇంటరెస్టింగ్ గా మొదలుపెట్టినప్పటికీ దర్శకుడు తను బాలక్ క్రైమ్ ని హారర్ ని మిక్స్ చేయబోయి జస్ట్ యావరేజ్ మూవీ ఇచ్చాడు. నిడివి కూడా ఎక్కువ కావడంతో కొన్ని సన్నివేశాలు రిపీట్ గా అనిపిస్తాయి. అసలు ట్విస్ట్ అంత సులభంగా ఊహించేది కాకపోయినా దాని థ్రిల్లింగ్ గా కట్ చేయడంలో విఫలం కావడంతో క్లైమాక్స్ కూడా చప్పగా మారిపోయింది. పృథ్విరాజ్ చేయాల్సిన క్యారెక్టరేం కాదు. చాలా రొటీన్ గా ఉంది. పద్మజ గుర్తుండిపోతుంది. అసలు విలన్ పాత్ర మాత్రం తేలిపోయింది. ఫైనల్ గా కోల్డ్ కేస్ టైటిల్ కు తగ్గట్టు కాస్త ఉప్పగా కాస్త చేదుగా కొంతే తీయగా ఉంది. మరీ ఖాళీ టైం ఉంటే తప్ప పెట్టుకోదగ్గ ఛాయస్ అయితే కాదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి