iDreamPost

రోహిత్‌ వడా పావ్‌ కాదు.. అందరి కంటే ఫిట్‌గా ఉన్న ప్లేయర్‌! కారణం చెప్పిన కోచ్‌

రోహిత్ శర్మ ఫిట్ నెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు గతంలో అతడికి కోచింగ్ ఇచ్చిన ఓ కోచ్. టీమిండియాలో ఫిట్టెస్ట్ ప్లేయర్ హిట్ మ్యాన్ అంటూ కితాబిచ్చాడు ఇతడు.

రోహిత్ శర్మ ఫిట్ నెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు గతంలో అతడికి కోచింగ్ ఇచ్చిన ఓ కోచ్. టీమిండియాలో ఫిట్టెస్ట్ ప్లేయర్ హిట్ మ్యాన్ అంటూ కితాబిచ్చాడు ఇతడు.

రోహిత్‌ వడా పావ్‌ కాదు.. అందరి కంటే ఫిట్‌గా ఉన్న ప్లేయర్‌! కారణం చెప్పిన కోచ్‌

ప్రపంచ క్రికెట్ లో ఫిట్టెస్ట్ క్రికెటర్ ఎవరు అంటే? చాలా మంది టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ పేరునే చెబుతారు. ఇక మరో స్టార్ బ్యాటర్ కమ్ భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ను బద్దకస్తుడని, వడాపావ్ అని రకరకాలుగా గతంలో విమర్శించిన సంగతి మనందరికి తెలిసిందే. అయితే హిట్ మ్యాన్ వడాపావ్ కాదని.. నిజానికి అతడే అందరికి కంటే ఫిట్ ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు గతంలో అతడికి కోచింగ్ ఇచ్చిన కోచ్. మరి రోహిత్ ఫిట్ నెస్ గురించి అతడు చెప్పిన మరిన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఏ క్రీడకైనా శారీరక, మానసికంగా దృఢంగా ఉండటం ఎంతో ముఖ్యం. మరీ ముఖ్యంగా ఫుట్ బాల్, క్రికెట్ లాంటి ఆటలకు ఆటగాళ్లకు ఫిట్ నెస్ చాలా అవసరం. గ్రౌండ్ లో చిరుత వేగంతో పరిగెత్తాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్లేయర్లు చాలా కఠోర శ్రమ చేయాల్సి వస్తుంది. యోయో లాంటి కొన్ని టెస్ట్ లు కూడా పాస్ అవ్వాలన్న సంగతి మనకు తెలియనిది కాదు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు అతడి కోచ్.
“చాలా మంది రోహిత్ శర్మను వడాపావ్, లావుగా ఉన్నాడని విమర్శిస్తూ ఉంటారు. కానీ నిజానికి రోహిత్ చాలా ఫిట్ ప్లేయర్. ఇతర క్రికెటర్లలాగా.. అతడు తరచుగా గాయాలబారిన పడడు. ఆ విషయం మనందరికి తెలుసు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తో పాటుగా ఇతర ప్లేయర్లు ఎక్కువగా ఇంజ్యూరీ అవుతుంటారు. కానీ రోహిత్ గాయపడటం మీరు చాలా అరుదుగా చూసుంటారు. మిగతా ప్లేయర్లు ఫిట్ గా కనిపించినప్పటికీ.. గాయపడటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే రోహిత్ అలా కాదు.. కాస్త బొద్దుగా కనిపిస్తున్నా ఎప్పుడూ ఫిట్ గా ఉంటాడు. ప్రత్యేకంగా శారీరక దారుఢ్యం గురించి పట్టించుకోకుండా.. అతడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇదే అతడి ఫిట్ నెస్ సీక్రెట్” అంటూ హిట్ మ్యాన్ ఫిట్ నెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు కోచ్.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ధర్మశాల వేదికగా జరుగుతున్న నామమాత్రపు 5వ టెస్ట్ లో టీమిండియా తొలిరోజు పట్టుబిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ను 218 రన్స్ కే కుప్పకూల్చింది. ఓపెనర్ జాక్ క్రాలే ఒక్కడే 79 పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు భారత స్పిన్ కు దాసోహమైయ్యారు. వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్ 4, కుల్దీప్ యాదవ్ 5 వికెట్లుతో ప్రత్యర్థి బ్యాటర్లను పెవిలియన్ కు క్యూ కట్టించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 10 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. క్రీజ్ లో జైస్వాల్(25), కెప్టెన్ రోహిత్ శర్మ(21) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి హిట్ మ్యాన్ ఫిట్ నెస్ పై కోచ్ చెప్పిన విషయాలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by MIFansClubTN (@mifctn_official)

ఇదికూడా చదవండి: కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తున్న రోహిత్! ఇదేమి ఫీల్డ్ సెట్ చేయడం?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి