iDreamPost

ఆ స్థానాల్లో ఊహించని అభ్యర్థులను నిలబెట్టిన CM జగన్.. ఇక కూటమి ఔట్?

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీ,జనసేన కూటమికి నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా ఓ మాస్టర్ ప్లాన్ తో సీఎం జగన్ ముందుకొచ్చారు. దీంతో టీడీపీ, జనసేన కూటమి ఔట్ అనే టాక్ వినిపిస్తోంది.

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీ,జనసేన కూటమికి నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా ఓ మాస్టర్ ప్లాన్ తో సీఎం జగన్ ముందుకొచ్చారు. దీంతో టీడీపీ, జనసేన కూటమి ఔట్ అనే టాక్ వినిపిస్తోంది.

ఆ స్థానాల్లో ఊహించని అభ్యర్థులను నిలబెట్టిన CM జగన్.. ఇక కూటమి ఔట్?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో అధికార వైఎస్సార్ సీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తుంది. ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యర్థులను ఆశ్చర్యానికి, అయోమయానికి గురి చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు సీఎం జగన్ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు సంచలమే. తాజాగా తీసుకున్న మరో నిర్ణయం కూటమికి నిద్రపట్టనివ్వడం లేదని టాక్ వినిపిస్తోంది.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షాలు ప్లాన్ వేసే లోపే..జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. అంతేకాక అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే  అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా సీఎం జగన్ ప్రణాళికలు రచించి 2019 ఘన విజయం సాధించారు. ఈ సారి సీఎం హోదాల్లో జగన్ మోహన్ రెడ్డి  ఎన్నికల బరిలో దిగారు. ఈ క్రమంలోనే 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే గెలుపు గుర్రాలనే రంగంలోకి దింపాలనేది సీఎం జగన్ ఆలోచన. అలానే సామాజికవర్గం, స్థానికంగా ఉండే అనుకూల అంశాలతో పాటు ఇతర  అంశాల ప్రాతిపాదికను అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటిస్తున్నారు.

వైసీపీ ప్రకటించిన జాబితాను పరిశీలిస్తే.. అదే అర్థమవుతుంది. కర్నూలులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి ఇవ్వడం, నెల్లూరు పార్లమెంట్ విజయ సాయిరెడ్డిని నియమించడం జరిగింది. ఇక ఎంతో  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంగళగిరి విషయంలో లోకేశ్ కి మైండ్ బ్లాక్ అయ్యే నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయా పడ్డారు. అక్కడ స్థానికత, ఇతర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న సీఎం జగన్ మురుగుడ లావణ్యను మంగళగిరి ఇన్ ఛార్జీగా ప్రకటించారు.  ఇలా ఒక్కొక్క జాబితా ఊహించని ట్విస్టులు ఇస్తూ సీఎం జగన్…టీడీపీ, జనసేన కూటమిని గందరగోళానికి గురి చేస్తున్నారు.

తాజాగా విడుదల చేసిన 11వ జాబితాను చూసినట్లు అయితే ఏకంగా ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. అందరూ రాజోలు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పోటీ చేస్తారని భావించారు. అయితే తాజాగా జాబితాలో ఆయనను అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి ఇన్ ఛార్జీగా నియమించి ఊహించని మరో షాకి ఇచ్చారు సీఎం జగన్. ముఖ్యంగా రాపాకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మంచి గుర్తింపు ఉందని సమాచారం.  మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఆ పార్లమెంట్ పరిధిలో బలం ఉందంట. అలానే ఆ పరిధిలోనే వైసీపీ పార్టీ బలం, సామాజిక సమీకరణలు వంటి ఇతర అంశాలు రాపాకకు, పార్టీకి సానుకూలంగా మారుతాయని పొలిటికల్ ఎనలిస్ట్ లు అభిప్రాయ పడుతున్నారు. ఇదే స్థానంలో ఇప్పటికే టీడీపీ, జనసేన నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు సాగుతున్నాయని.

వీరి ఉమ్మడి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇదే సమయంలో సీఎం జగన్… అనకాపల్లి ఇన్ ఛార్జీని ప్రకటించారు. అలానే రాజోలు అసెంబ్లీ స్థానాన్ని ఎలాగైన  కైవసం చేసుకోవాలనుకున్న జనసేన, టీడీపీ కూటమి కూడా గట్టి షాకిచ్చారు సీఎం జగన్. ఇక్కడ వైసీపీ ఇన్ ఛార్జీగా ఇటీవల పార్టీలో చేరిన మాజీమంత్రి గొల్లపల్లి సూర్యరావును అధిష్టానం ప్రకటించింది. దీంతో ఈ ప్రభావంత అటూ అనకాపల్లి జిల్లా, కోనసీమ జిల్లాలో టీడీపీ, జనసేన కూటమి క్లీన్ బౌల్డ్ చేస్తుందనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సీఎం జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ టీడీపీ, జనసేన కూటమికి నిద్ర లేకుండా చేస్తుందనే పొలిటికల్ ఎనలిస్టులు, వైసీపీ నేతలు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి