iDreamPost

ఏలూరు బాధితులకు సీఎం పరామర్శ.. అండగా ఉంటామని భరోసా ఇచ్చిన వైఎస్‌ జగన్‌

ఏలూరు బాధితులకు సీఎం పరామర్శ.. అండగా ఉంటామని భరోసా ఇచ్చిన వైఎస్‌ జగన్‌

అంతుచిక్కని వ్యాధికి గురై ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. ఈ రోజు ఉదయం తాడేపల్లి నుంచి ఏలూరు వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌.. నేరుగా ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆస్పత్రిలో అన్ని వార్డులను తిరిగిన సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రతి బాధితుడి బెడ్‌ వద్దకు వెళ్లి వారి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. ఆస్పత్రికి రావడానికి ముందు ఎలాంటి పరిస్థితి ఉంది.. ప్రస్తుతం ఎలా ఉన్నారనంటూ జగన్‌ బాధితులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు.

ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో తెలుసుకున్నారు. క్లినిక్‌ పరీక్షలు నిర్వహించిన విషయం అధికారులు సీఎంకు వివరించారు. కోవిడ్‌ కాదని పేర్కొన్నారు. కల్చర్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ రావాల్సి ఉందని, అది వస్తే ఏ విషయం తెలుస్తుందని వివరించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిరంతరం బాధితులను పర్యవేక్షించాలని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి