iDreamPost

గుంటడు స్పీచ్ దంచీనాడేస్ !!

గుంటడు స్పీచ్ దంచీనాడేస్ !!

ఓరి నాయిన .ఏటీ..ఆ గుంటడి మాటలు …దంచీనాడేస్… ఆడి మాటలకు స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది ..జగనైతే ఏకం దగ్గిరకి తీసుకుని ముద్దెట్టిసాడు ..ఉంతార్రా బాబు..గవరమెంట్ స్కూల్లోనూ చాకుల్లాంటోళ్లు ఉంటార్రా బావు…అని చెప్పుకుపోతున్నడు పైడిరాజు ..అంతలో నాగరాజు అడ్డొచ్చి..ఒరే ఆపేస్..ఏట్రా నీ గోల..అసలేటయింది చెప్మి అన్నాడు ..ఏటవ్వలేదురా..ఈరోజు జగన్ మీటింగులో మన బొప్పడం కుర్రాడు గొప్పగా మాట్లాడేనాడేస్ ..సూడుమి అన్నాడు పైడి రాజు ..మొత్రానికి ఆరోక్లాస్ చదువుతున్న అభిమన్యు తన ప్రసంగంలో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసాడు….

బొప్ప‌డాం జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న సిహెచ్‌. అభిమ‌న్యు త‌న ఆంగ్ల ప్ర‌సంగంతో అద‌ర‌గొట్టాడు. స్వ‌చ్ఛ‌మైన ఉచ్ఛార‌ణ‌తో గట్టిగా, ఎటువంటి త‌డ‌బాటు, తొంద‌ర‌పాటు లేకుండా ప్ర‌సంగించి ఆక‌ట్టుకున్నాడు. ముఖ్య‌మంత్రి ముందు ప్ర‌సంగించే అవ‌కాశం రావ‌డం త‌న‌కు ల‌భించిన గొప్ప అవ‌కాశ‌మంటూ ప్రారంభించి, ముఖ్య‌మంత్రి ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ, వాటిని పొగుడుతూ మాట్లాడాడు. రాష్ట్రంలో వివిధ ప‌థ‌కాల ద్వారా పేద‌రిక నిర్మూళ‌న జ‌రుగుతోంద‌ని, విద్యార్థుల‌కు ఈ ప‌థ‌కాలు ఎంత‌గానో మేలు చేస్తున్నాయ‌ని చెప్పాడు. మాట తిప్పని, మ‌డ‌మ తిప్ప‌ని ముఖ్య‌మంత్రిగా అన‌తి కాలంలోనే జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి త‌న పేరును నిల‌బెట్టుకున్నార‌ని పేర్కొన్నాడు. అమ్మ ఒడి త‌న‌లాంటి పిల్ల‌ల‌ చ‌దువు స‌క్ర‌మంగా కొన‌సాగించేందుకు ఎంత‌గానో దోహ‌ద ప‌డుతుంద‌ని అన్నాడు. పాల‌కుడు మ‌హావిష్ణువుతో స‌మాన‌మ‌ని కీర్తిస్తూ ఒక సంస్కృత శ్లోకాన్ని వ‌ళ్లించి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి కూడా మ‌హావిష్ణువు లాంటివార‌ని పేర్కొన‌డంతో, సిఎం ముఖాన చిరున‌వ్వు విర‌బూసింది. జ‌గ‌న‌న్న గోరుముద్ద ప‌థ‌కం ఒక అమృత భాండ‌మ‌ని, మెనూ అద్భుతంగా ఉంద‌ని కొనియాడాడు. భ‌విష్య‌త్తులో తాను ఐఏఎస్ అధికారిని అవ్వాల‌ని కోరుకుంటున్నాన‌ని చెప్పి ప్ర‌సంగాన్ని ముగించిన వెంట‌నే స‌భ క‌ర‌తాళ ద్వ‌నుల‌తో మారుమ్రోగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి