iDreamPost

టీచర్‌గా మారిన జిల్లా కలెక్టర్..విద్యార్థులకు పాఠాలు!

కలెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జిల్లా మొత్తం కలెక్టర్ ఆధీనంలో ఉంటుంది. అందుకే తరచూ వారు ప్రభుత్వ ఆఫీసులు, ఇతర కార్యాలయాల్లో తనిఖీలు చేస్తుంటారు. తాజాగా ఓ కలెక్టర్ టీచర్ గా మారి..విద్యార్థులకు పాఠాలు బోధించారు.

కలెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జిల్లా మొత్తం కలెక్టర్ ఆధీనంలో ఉంటుంది. అందుకే తరచూ వారు ప్రభుత్వ ఆఫీసులు, ఇతర కార్యాలయాల్లో తనిఖీలు చేస్తుంటారు. తాజాగా ఓ కలెక్టర్ టీచర్ గా మారి..విద్యార్థులకు పాఠాలు బోధించారు.

టీచర్‌గా మారిన జిల్లా కలెక్టర్..విద్యార్థులకు పాఠాలు!

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు జరుగుతూనే ఉంటాయి. ఉన్నతాధికారులు ఉన్నట్టుండి పాఠశాలలకు వచ్చి అక్కడి ఉపాధ్యాయుల పని తీరును గమనిస్తూ ఉంటారు. విద్యార్థుల బాగోగులను తెలుసుకుని, దానికి తగిన చర్యలు తీసుకుని వెళ్తుంటారు. కానీ, ఏలూరు జిల్లాకు చెందిన కలెక్టరు మాత్రం వీటికి భిన్నంగా చేసి.. అందరి ప్రశంసలు పొందుతున్నారు. ప్రసన్న వెంకటేష్ ఏలూరు జిల్లాకు కలెక్టరుగా పని చేస్తున్నారు. అయితే, ఆకస్మిక తనిఖీలలో భాగంగా తాజాగా ఆయన ఒక పాఠశాలను సందర్శించారు. ఒక ఉన్నత అధికారి హోదాలో అక్కడికి చేరుకున్న జిల్లా కలెక్టర్.. విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ గా మారారు. ఇప్పటికే ఎంతో మంచి పేరును సంపాదించిన వెంకటేష్..  ఇలా టీచర్ గా మారి వార్తల్లో నిలిచారు.

అది ఏలూరు జిల్లాలో గానుగులపేటలోని..  వీరమాచినేని విమలాదేవి నగర పాలక ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో  ఆకస్మిక తనిఖీలు చేసేందుకు వెళ్లారు ఆ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు పని తీరు ఎలా ఉంది. విద్యార్థులు టీచర్లు చెప్పే పాఠాలను ఎంతవరకు గ్రహిస్తున్నారు. ఇలా ప్రతి విషయాన్నీ దగ్గరుండి పరిశీలించారు. ఈ క్రమంలో ఓ తరగతిలోని విద్యార్థులకు తానే ఉపాధ్యాయుడిగా మారారు. అక్కడ విద్యార్థులకు  వెంకటేష్ పాఠాలు బోధించారు.

స్వయంగా జిల్లా కలెక్టరు పాఠాలు బోధించడంతో ఆ విద్యార్థుల ఆనందానికి అవధులు లేవు. కేవలం వారికి పాఠాలు బోధించడమే కాకుండా.. తానూ చెప్పింది ఎంత వరకు విద్యార్థులు గ్రహించారు అని కూడా తెలుసుకున్నారు. తాను బోధించిన పాఠంలోని కొన్ని ప్రశ్నలను ఆ విద్యార్థులకు సంధించిగా.. వారు కూడా వెంటనే సరైన సమాధాలను  అందించారు. దీనితో శ్రద్దగా తన పాఠాన్ని విన్న విద్యార్థులను అభినందించారు వెంకటేష్. విద్యార్థులు సైతం కలెక్టర్ ప్రశంసలకు మురిసిపోయారు. వెంకటేష్ చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకుని.. శ్రద్దగా అన్నిటిని పాటిస్తామని విద్యార్థులు  తెలిపారు. ఇక కలెక్టర్ వెంకటేష్ అక్కడి ఉపాధ్యాయుల పని తీరును కూడ గమనించారు.

మరో వైపు, జిల్లా కలెక్టర్ గా అన్ని అంశాలపైన స్పందిస్తూ.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరిస్తున్నారు. తన వ్యవహార శైలితో ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని.. మంచి గుర్తింపు పొందారు వెంకటేష్.  ఒక  ఉన్నతాధికారి హోదాలో ఉండి కూడా సాదాసీదాగా ఉంటూ అందరిని ఆకట్టుకుంటున్నారు ఈ కలెక్టర్. ప్రస్తుతం ప్రసన్న వెంకటేష్ పాఠాలను బోధించిన వీడియోలు.. సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. మరి.. విద్యార్థుల కోసం టీచర్ గా మారిన ఈ కలెక్టర్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి