iDreamPost

వీడియో: వృద్ధులు చేసిన నృత్యానికి కంటతడి పెట్టిన కలెక్టర్

వీడియో: వృద్ధులు చేసిన నృత్యానికి కంటతడి పెట్టిన కలెక్టర్

సృష్టికి జీవం అమ్మ. ఏమిచ్చినా, ఎంత చేసినా అమ్మ రుణం తీర్చుకోలేము. నవ మాసాలు మోసి పురిటి నొప్పుల బాధను భరించి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. తను పస్తులుండి బిడ్డల కడుపు నింపుతుంది. బిడ్డకు ఏ కష్టం దరి చేరకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అంతటి త్యాగమూర్తులను నేడు వారి బాగోగులను పట్టించుకోకుండా వదిలించుకుంటున్నారు కొందరు మూర్ఖులు. అనాధ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో చేర్చి చేతులు దులుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వృద్ధాశ్రమంలో వృద్ధులు చేసిన నృత్యం ఓ కలెక్టర్ హృదయాన్ని కదిలించింది. వారు నృత్యం చేస్తున్నంత సేపు కంట నీరు కార్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కన్న బిడ్డలే లోకంగా వారి భవిష్యత్ కోసం తమ జీవితాల్ని త్యాగం చేసిన తల్లిదండ్రులను కొడుకులు, కోడళ్లు, కూతుర్లు వృద్ధాశ్రమంలో వదిలేసి మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. జీవిత చరమాంకంలో మనవలు, మనవరాళ్లతో ఆనందంగా గడపాల్సిన వారు వృద్ధాశ్రమాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కాగా ఓ కలెక్టర్ వృద్ధాశ్రమంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యింది. అక్కడ వృద్ధులు తల్లి గొప్పదనాన్ని తెలిపే పాటకు డ్యాన్స్ చేశారు. ఇది చూసిన ఆ కలెక్టర్ హృదయం ద్రవించుకుపోయింది.భావోద్వేగానికి లోనైంది.

ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. నీలగిరి జిల్లాలోని మేలుకూడలూరులోని వృద్ధాశ్రమంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నీలగిరి జిల్లా కలెక్టర్ అరుణ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో వృద్ధులు నృత్యం చేస్తుంటే వారి బాధలను పాట రూపంలో వెల్లడించినట్లుగానే ఉంది. ఈ క్రమంలోనే ఆ కలెక్టర్ తల్లిగా, ఓ తల్లికి కూతురుగా వారి బాధలను అర్థం చేసుకుని కంటతడి పెట్టుకుంది. ఆ వృద్ధుల బాధను చూసిన అక్కడున్న వారు బరువెక్కిన హృదయాలతో తట్టుకోలేకపోయారు. కాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టిటా వైరల్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి