iDreamPost

చంద్రబాబుకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు చేసిన సీఐడీ

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెట్రల్ జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఏపీ సీఐడీ మరో షాక్ ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెట్రల్ జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఏపీ సీఐడీ మరో షాక్ ఇచ్చింది. బాబుపై మరో కేసు నమోదు చేసింది ఏపీ సీఐడీ. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసింది ఏపీ సీఐడీ. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చింది సీఐడీ. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సీఐడీ ఏసీబీ కోర్టుకు అందించింది. ఈ కేసుపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది సీఐడీ. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ ను ఏసీబీ కోర్టు అనుమతించింది.

చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టం కింద ( ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) చంద్రబాబుపై ఈ కేసు నమోదైంది. తాజాగా నమోదైన కేసులో ఏ1గా నరేశ్ పేరు ఉండగా, ఏ2గా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరును ప్రస్తావించారు. ఏ3గా చంద్రబాబు పేరును నమోదు చేశారు. ఏపీ బెవరేజస్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. ఇప్పటికే దాఖలైన స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు విచారణ ఎదుర్కొంటున్నారు. బాబు అరెస్టై ఇప్పటికే 50 రోజులు పూర్తికాగా బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి