iDreamPost
android-app
ios-app

Chris Gayle: తెలంగాణ టీమ్ కు కెప్టెన్ గా గేల్! మరోసారి విధ్వంసానికి రెడీ..

  • Published Feb 09, 2024 | 8:35 AM Updated Updated Feb 09, 2024 | 8:35 AM

విండీస్ విధ్వంసకర వీరుడు మరోసారి క్రికెట్ లవర్స్ ను అలరించడానికి సిద్దమయ్యాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024లో తెలంగాణ టైగర్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు.

విండీస్ విధ్వంసకర వీరుడు మరోసారి క్రికెట్ లవర్స్ ను అలరించడానికి సిద్దమయ్యాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024లో తెలంగాణ టైగర్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు.

Chris Gayle: తెలంగాణ టీమ్ కు కెప్టెన్ గా గేల్! మరోసారి విధ్వంసానికి రెడీ..

క్రిస్ గేల్.. ప్రపంచ క్రికెట్ లో ఈ పేరు విధ్వంసానికి పర్యాయపదం. యూనివర్సల్ బాస్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ కరేబియన్ వీరుడు ఐపీఎల్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిన విషయం తెలిసిందే. సిక్సర్ల మోతతో క్రికెట్ లవర్స్ ను ఊర్రూతలూగించాడు ఈ దిగ్గజ బ్యాటర్. ఇక ఇప్పుడు మరోసారి బ్యాట్ పట్టేందుకు సిద్దమవుతున్నాడు. బోర్డ్ ఫర్ వెటరన్ క్రికెట్ ఇన్ ఇండియా(BVIC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(IVPL)లో భాగమయ్యాడు గేల్. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే? తెలంగాణ టీమ్ కు అతడు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ లీగ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

యూనివర్సల్ బాస్, విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ మరోసారి ప్రేక్షకులను తన బ్యాటింగ్ తో అలరించడానికి సిద్దమవుతున్నాడు. ఐపీఎల్ లో సిక్స్ లతో గేల్ సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. ఐపీఎల్ లాంటి టోర్నీ నిర్వహించనుంది బోర్డ్ ఫర్ వెటరన్ క్రికెట్ ఇన్ ఇండియా(BVIC). ఈ బోర్డు ఆధ్వర్యంలో ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఓ టోర్నీ జరగనుంది. ఇక లీగ్ లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, మునాఫ్ పటేల్, హెర్షల్ గిబ్స్, సురేష్ రైనా, యూసఫ్ పఠాన్ లాంటి ప్లేయర్లు పాల్గొననున్నారు.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే? ఈ లీగ్ లో తెలంగాణ టీమ్ కూడా భాగమైంది. తెలంగాణ టీమ్ కు క్రిస్ గేల్ నాయకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. మెుత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్ లో తెలంగాణ టైగర్స్ తో పాటుగా ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, చత్తీస్ ఘడ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ టీమ్ లు తలపడనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు డెహ్రడూన్ వేదికగా ఈ లీగ్ జరగనుంది. ముంబై టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. ఇక తెలంగాణ జట్టులో గేల్ తో పాటుగా భారత మాజీ ప్లేయర్లు సుదీప్ త్యాగి, మన్ ప్రీత్ గోనీ, రికార్డో పావెల్ ఉన్నారు. మరి టోర్నీలో గేల్ ఏ రేంజ్ విధ్వంసాన్ని సృష్టిస్తాడో వేచిచూడాలి.

ఇదికూడా చదవండి: ఆ ప్లేయర్ క్రికెట్ ఆడకపోవడం ప్రపంచ క్రికెట్ కే నష్టం: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్