iDreamPost
android-app
ios-app

Viswambhara: విశ్వంభర నుంచి క్రేజీ అప్డేట్‌.. చిరంజీవి చేసే క్యారెక్టర్‌ ఇదే

  • Published Feb 25, 2024 | 2:45 PM Updated Updated Feb 25, 2024 | 2:49 PM

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంభర. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్‌ వచ్చింది. చిరంజీవి చేసే పాత్ర ఏదో రివీల్‌ చేశారు మేకర్స్‌. ఆ వివరాలు..

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంభర. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్‌ వచ్చింది. చిరంజీవి చేసే పాత్ర ఏదో రివీల్‌ చేశారు మేకర్స్‌. ఆ వివరాలు..

  • Published Feb 25, 2024 | 2:45 PMUpdated Feb 25, 2024 | 2:49 PM
Viswambhara: విశ్వంభర నుంచి క్రేజీ అప్డేట్‌.. చిరంజీవి చేసే క్యారెక్టర్‌ ఇదే

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా నిలవబోతుంది విశ్వంభర. ఈ సినిమాకు డైరెక్టర్‌ వశిష్ట దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేయగా.. అవి సినిమా మీద భారీ అంచనాలు పెంచాయి. సోషియో ఫాంటసీ కథతో రాబోతున్న ఈ సినిమాపై రోజుకు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోందని అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా విశ్వంభర సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్‌ తెలిసింది. ఆ వివరాలు..

ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌ నాగార్జున సాగర్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక విశ్వంభర చిత్రంలో చిరంజీవి.. రైస్‌ మిల్లు ఓనర్‌గా నటిస్తున్నారట. ఇక సినిమా షూటింగ్‌లో భాగంగా శనివారం నాడు వజ్రతేజ రైస్‌ మిల్లులో కొన్ని సన్నివేశాలను మూవీ యూనిట్‌ సభ్యులు చిత్రీకరించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన విశ్వంభర సినిమా షూటింగ్‌ సన్నివేశాలు రాత్రి వరకు నిర్వహించారు. హీరో చిరంజీవితో పాటు సినీ ఆర్టిస్టులపై ఈ సీన్స్‌ చిత్రీకరించారు. రైస్‌ మిల్లులో చిరంజీవి సినిమా షూటింగ్‌ జరుగుతుందని తెలిసి చుట్టు పక్కల జనాలు భారీ ఎత్తున తరలి వచ్చారు. వారిని అదుపు చేసేందుకు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు.

ఇక ఈ సినిమాలో త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. వారే సురభి, ఇషా చావ్లాలు. సురభి చివరిసారిగా తెలుగులో 2019 లో శశి సినిమాలో కనిపించింది. అలానే ఇషా చావ్లా మిస్టర్ పెళ్లికొడుకు సినిమా తర్వాత సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ విశ్వంభరతో వీరిద్దరూ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక విశ్వంభర షూట్ నెక్స్ట్ షెడ్యూల్ మార్చ్ మొదటివారంలో మొదలు కానుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి అనగా జనవరి 10, 2025 రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో చిరంజీవి ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా కనిపిస్తారని అంటున్నారు. గతంలో ఆయన హిట్లర్‌ సినిమాలో ఇలాంటి పాత్రలోనే నటించారు. ఇప్పుడు కూడా అదే స్టోరీతో రాబోతున్నారట.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvolePradabet güncel girişjojobetpokerklasJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet