iDreamPost

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం.. ముందు కోడలికి.. ఇప్పుడు మామకి

  • Published May 27, 2024 | 4:03 PMUpdated May 27, 2024 | 4:03 PM

మెగాస్టార్‌ చిరంజీవి ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. ఇప్పటికే పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్న చిరంజీవి.. మరో అరుదైన పురస్కారాన్ని పొందారు. ఆ వివరాలు..

మెగాస్టార్‌ చిరంజీవి ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. ఇప్పటికే పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్న చిరంజీవి.. మరో అరుదైన పురస్కారాన్ని పొందారు. ఆ వివరాలు..

  • Published May 27, 2024 | 4:03 PMUpdated May 27, 2024 | 4:03 PM
Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం.. ముందు కోడలికి.. ఇప్పుడు మామకి

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. అబుదాబి ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక గౌరవాన్ని తాజాగా చిరంజీవి అందుకున్నారు. అయితే మెగాస్టార్‌ కన్నా ముందే ఆయన కోడలు ఉపాసన ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు తాజాగా చిరంజీవి.. ఈ జాబితాలో చేరారు. ఈ పురస్కారం గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తమిళ స్టార్‌ హీరోలు రజనీకాంత్‌, కలమ్‌ హాసన్‌లు ఈ అరుదైన పురస్కారాన్ని పొందారు. ఇప్పుడు చిరంజీవి కూడా వీరి సరసన చేరనున్నారు. ఇంతకు చిరంజీవి అందుకున్న ఆ అరుదైన గౌరవం ఏంటి.. దాన్ని ఎవరు.. ఎందుకు అందజేస్తారు వంటి వివరాలు మీ కోసం..

యూఏఈ ప్రభుత్వం.. ప్రత్యేకంగా ఇచ్చే గోల్డెన్‌ వీసా అవార్డు గురించి కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గోల్డెన్‌ వీసాను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నారు. యూఏఈ ప్రభుత్వం చిరంజీవికి గోల్డెన్‌ వీసాను అందించింది. అయితే చిరంజీవి కన్నా ముందే మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఈ గోల్డెన్‌ వీసాను అందుకున్నారు. మెగాస్టార్‌ కన్నా ముందు ఆయన కోడలు ఉపాసన.. అల్లు అర్జున్‌ గోల్డెన్‌ వీసాను అందుకున్నారు. ఇప్పుడు చిరంజీవికి కూడా దీన్ని ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక వివిధ రంగాల అంటే కళలు, సృజనాత్మకత, పరిశ్రమలు, సాహిత్యం, విద్య, వారసత్వ సంపద, చరిత్ర, కల్చర్‌ గురించి అధ్యయనం చేసే వారికి.. ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్‌ వీసాను జారీ చేస్తుంది. దీన్ని అందుకున్న వారు.. ఆ దేశంలో పదేళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు, తిరిగేందుకు అనమతి లభిస్తుంది. ఇక 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్‌ వీసాలను మంజూరు చేస్తుంది.

ఈ గోల్డెన్‌ వీసా పొందిన వారు దుబాయ్‌, అబుదాబితో పాటు దేశంలో ఎక్కడైనా 100 శాతం ఓనర్‌షిప్‌తో వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇక భారత్ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న మొదటి వ్యక్తి.. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్. ఆ తర్వాత సానియా మీర్జాతో పాటు చాలా మంది సెలెబ్రిటీలు అందుకున్నారు. ఇక దక్షిణాది నుంచి హీరోయిన్ త్రిష, మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, విక్రమ్‌, కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ తదితరులు ఈ వీసాని అందుకున్న వారిలో ఉన్నారు. ఇప్పుడీ జాబితాలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా చేరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి