iDreamPost

తమిళనేతలను తలదన్నేలా చింతామోహన్‌ హామీలు

తమిళనేతలను తలదన్నేలా చింతామోహన్‌ హామీలు

తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో.. తమను గెలిస్తే ప్రజలను చంద్రమండలానికి తీసుకెళతామని, ఇంటికొక ఐఫోన్‌ పంపిణీ చేస్తామని, మంచుకొండలను సృష్టిస్తామని.. ఇలా అనేక రకాల హామీలు ఇవ్వడం చూశాం. తమిళనేతల హామీలను తలదన్నేలా.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చింతా మోహన్‌ హామీలు ఇస్తున్నారు. ఆరు సార్లు ఎంపీగా, పలుమార్లు కేంద్ర మంత్రిగా పని చేసిన వ్యక్తి.. ఇస్తున్న హామీలు విన్న వారు విస్తుబోతున్నారు.

ఉప ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే.. తిరుపతిని ఏపీ రాజధానిగా చేస్తానని చింతా మోహన్‌ ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఆయన ఇదేమీ ఆషామాషీగా చెప్పడం లేదు. నూటికి నూరుపాళ్లు తిరుపతిని రాజధాని నగరంగా చేస్తానని నొక్కి మరీ చెబుతున్నారు. మీడియాతోనూ ఇవే మాటలు మాట్లాడుతున్నారు. అంతేకాదు ప్రతి పేదవారికి వారు ఉన్న చోటనే డబుల్‌బెడ్‌ రూం ఇళ్లును కూడా కట్టించి ఇస్తానని చింతామోహన్‌ చెబుతున్నారు. తిరుపతికి అంతర్జాతీయ విమాన సర్వీసులు తిప్పేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నారు.

Also Read : చింతా మోహ‌న్ స్టైలే వేరు!

ఇళ్లు కట్టించడం, విమనానాలు తిప్పడం, రోడ్డు వేయడం, పరిశ్రమలు స్థాపిస్తానని చెప్పడం.. వరకూ రాజకీయ నాయకులు చెప్పేవే. కానీ ఎంపీగా గెలిపిస్తే రాజధానిగా తిరుపతిని చేస్తానని చింతామోహన్‌ చెప్పడమే విడ్డూరంగా ఉంది. పైగా ఆయన సీరియస్‌గా చెబుతున్నారు. సరదాగా తీసుకునేందుకు లేదు. రాష్ట్ర రాజధానిని ఎంపిక చేసే అధికారం ఎంపీకి ఉంటుందా..? ఆ అధికారం ఎవరికి ఉంటుంది..? అనే విషయం ఆరు సార్లు ఎంపీ అయిన చింతా మోహన్‌కు తెలియదా..? ఇలాంటి హామీ ఇచ్చారంటే.. చింతా మోహన్‌ మానసిక పరిస్థితి సరిగా లేకుండా ఉండాలి లేదా.. ప్రజలను తెలివితక్కువ వాళ్లు మాదిరిగా భావిస్తున్నారనుకోవాలి.

ఛీ ఛీ అనకుండా.. స్వాగతిస్తున్నారట..

మొన్నటి వరకు నాలుగో స్థానంలో ఉన్న తాను ఇప్పుడు మూడో స్థానంలోకి వచ్చానని చింతా మోహన్‌ చెబుతున్నారు. బీజేపీ నాలుగో స్థానంలోకి పడిపోయిందని జోస్యం చెబుతున్నారు. 2014లో ప్రజలు తనను ఛీ ఛీ ఛీ ఛీ అన్నారని, 2019లో మూడు ఛీలు పోయి ఛీ అన్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం ఆ ఒక్క ఛీ కూడా పోయి.. స్వాగతిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. తాను ఎన్నికల ప్రచారానికి వెళితే.. నమస్కారం పెడుతున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు చింతా మోహన్‌.

Also Read : చింతా మోహన్‌ చిలక జోస్యం… చింత చచ్చినా పులుపు చావలేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి