iDreamPost

చైనాలో గులకరాళ్లతో సరికొత్త వంట!

చైనాలో గులకరాళ్లతో సరికొత్త  వంట!

వింత వింత వంటలకు, సరికొత్త డీష్ లకు పెట్టింది పేరు చైనా. ఎన్నో రకాల  జంతువులతో, వివిధ మొక్కలతో ఈ చైనీయులు వంటలను తయారు చేస్తారు.. పాకే బళ్లి నుంచి.. ఎగిరే పక్షి వరకు ప్రతి జీవిని ఆహారంగా చేసుకుని తింటారు. ఇక వారి వంటలను చూసి… యావత్తు ప్రపంచం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. తాజాగా  చైనీయులు గులకరాళ్లతో ఓ వెరైటీ డిష్ చేశారు. వినడానికి ఆశ్చర్యం వ్యక్తంగా ఉన్నా.. ఇది వాస్తవం. మరి.. ఆ డిష్ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

సాధారణంగా ఎవరైనా ఒక వంటను తయారు చేయాలంటే.. కారం, ఉప్పు, మసాల వంటి వాటిని ఉపయోగిస్తారు. అయితే  చైనాలలో గులక రాళ్లతో  వంటను తయారు చేశారు. ఇప్పుడు ఈ ప్రత్యేక డిష్ గా చైనాలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇంతకు దీనికి ఎలా తయారు చేస్తారో అనే సందేహం అందరూ వ్యక్తం చేస్తున్నారు.   అలానే గులక రాళ్ల ఆహారం ఇంత ఫేమస్ ఎలా అయిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియోలో వంట చేసే వ్యక్తి గులక రాళ్లకు వివిధ రకాల కూరగాయలను కలిపి.. వేడి వేడిగా వడ్డిస్తున్నట్లు చూపిస్తున్నాడు. సుయో డీయో అని ఈ వంటలో నది రాళ్లను, ఇతర సుగంధ ద్రవ్యాలను కలిపుతారు. ప్రస్తుతం అందరూ దీనిని ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వంటగా పేరు పొందింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వీడియో వైరల్ అవుతున్న దగ్గర నుంచి అసలు మార్కెట్లో ఇన్ని రకాల కూరగాయాలు వంటలు ఉండగా, రాళ్లను తిన్నాలిని ఎందుకు అనిపిస్తుందని సందేహం వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చైనాలో ఈ వంటకానికి కూడా ఏళ్ల చరిత్ర ఉందంట. పడవ నడిపే వారు, నది మధ్యలో చిక్కుక పోయినప్పుడు ఈ వంటను ఆహారంగా తింటారు. సరకులను పంపిణీ చేస్తునప్పుడు, ఆహారం అయిపోయినప్పుడు కొన్ని నదిరాళ్లను సేకరించి ఈ వంటకం  చేస్తారు. అందరూ అనుకున్నట్లు వీటిని వండి తిన్నరు. గ్రేవితో కలిపి తిని.. కేవలం ఆస్వాదిస్తారంట. ఏది ఏమైన చిత్ర విచిత్ర వంటలకు పెట్టింది పేరు చైనా అని.. మరోసారి నిరూపించుకుంది. మరి.. ఈ వెరైటీ డిష్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి