iDreamPost

రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వినూత్న ఆఫర్‌.. ఇల్లు కొంటే భార్య ఫ్రీ

  • Published Jan 25, 2024 | 9:14 AMUpdated Jan 25, 2024 | 9:14 AM

నేటి కాలంలో కస్టమర్లను ఆకట్టుకోవడం, వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం కంపెనీలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఆఫర్‌ గురించి మీరు ఇంత వరకు విని ఉండరు. ఆ వివరాలు..

నేటి కాలంలో కస్టమర్లను ఆకట్టుకోవడం, వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం కంపెనీలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఆఫర్‌ గురించి మీరు ఇంత వరకు విని ఉండరు. ఆ వివరాలు..

  • Published Jan 25, 2024 | 9:14 AMUpdated Jan 25, 2024 | 9:14 AM
రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వినూత్న ఆఫర్‌.. ఇల్లు కొంటే భార్య ఫ్రీ

మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండే అతి సామాన్యమైన కల.. సొంతంగా ఇల్లు కలిగి ఉండటం. సొంతింట్లోనే కన్ను మూయాలని చాలా మంది కలలు కంటారు. జీవితాంతం కష్టపడి సంపాందించి.. రూపాయి రూపాయి కూడబెట్టుకుని సొంతంగా ఇంటిని నిర్మించుకుంటారు కొందరు. ఇక నేటి కాలంలో ఇంటి నిర్మాణం అనేది ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందో ప్రత్యేకంగా చెప్పా‍ల్సిన పని లేదు. స్థలం, ఇంటి నిర్మాణం కోసం వాడే సరంజామ అన్నింటి ధరలు చుక్కలను తాకుతున్నాయి. అదలా ఉంచితే నేటి కాలంలో కుప్పలుతెప్పలుగా రియల్‌ ఎస్టేట్ సంస్థలు పుట్టుకొచ్చాయి.

సామాన్యుల సొంతింటి కలను వారు క్యాష్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు డబ్బు పెట్టండి మేం ఇల్లు కట్టిస్తాం అని చెబుతారు. అలానే కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తాయి. ఈ క్రమంలో తాజాగా ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ దిమ్మ తిరిగే ఆఫర్‌ ప్రకటించింది. ఇల్లు కొనండి.. భార్యను ఉచితంగా పొందండి అంటూ ప్రకటన ఇచ్చి.. సంచలనంగా నిలిచింది. ఆ వివరాలు..

If you buy a house, your wife is free

మరి ఈ ఆఫర్‌ ప్రకటించింది మన దేశంలోనేనా అంటే కాదు. చైనాకు చెందిన ఓ కంపెనీ ఈ తలతిక్క ఆఫర్‌ ప్రకటించింది. ‘ఇల్లు కొనండి, ఫ్రీగా భార్యను సొంతం చేసుకోండి’ అంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఇప్పుడీ ప్రకటన డ్రాగన్‌ కంట్రీలోనే కాక విదేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇలాంటి ప్రచారం చేయడానికి ప్రధాన కారణం.. చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇళ్లు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ క్రమంలో ఇంటి అమ్మకాలను పెంచాలనే ఉద్దేశంతో ఓ కంపెనీ ఏకంగా ‘ఇల్లు కొనండి.. భార్యను ఉచితంగా పొందండి’ అంటూ ప్రకటన చేసింది. ఇల్లు కొంటే ఉచితంగా భార్యను ఎలా ఇస్తారు.. అసలు ఈ ఆఫర్‌ వెనక ఆంతర్యం ఏంటి అంటే

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్ధగా ఎదిగిన చైనా.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఉంది. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో.. దేశంలో ఇల్లు, భూముల విక్రయాలు జరగక పెద్ద పెద్ద కంపెనీలు సైతం భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఉద్యోగ భద్రత లేకపోవడం.. ఆదాయం తగ్గడంతో చాలా మంది చైనా యువత పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. దాంతో ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి.. వివాహాలను ప్రోత్సహించేందుకు అనేక ఆఫర్లు ప్రకటించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు చైనాలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఈ రెండు అంశాలనూ ముడి పెడుతూ తాజా ఆఫర్‌ ప్రకటించింది. చైనాలోని టియాంజన్‌‌కు చెందిన సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ ‘ఇల్లు కొనండి.. భార్యను ఉచితంగా పొందండి’ అంటూ ప్రచారం ప్రారంభించింది. అయితే ఈ ఆఫర్‌ వల్ల ఇళ్ల అమ్మకాలు పెరగడం సంగతి అటుంచి.. ఆ కంపెనీనే చిక్కుల్లో పడింది. పైగా భారీ ఎత్తున జరిమానా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అయితే సదరు సంస్థ గతేడాది 2023, సెప్టెంబర్‌లో ఈ ప్రకటన చేసింది. అయితే దీనిపై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటన చేసినందుకు గాను సదరు కంపెనీకి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ సంస్థ 4,184 డాలర్ల పెనాల్టీ విధించింది. అంతేకాక ఇలాంటి ఆఫర్‌ ప్రకటనపై జనాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు కొనే స్థోమతే ఉంటే నువ్వు పెళ్లి చేయడం ఏంటి.. మేమే చేసుకుంటాం కదా అంటున్నారంట చైనా జనాలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి