iDreamPost
android-app
ios-app

Abhirami: ‘చెప్పవే చిరుగాలి’ మూవీలోని హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా మారిందో చూడండి..

కొంతమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాల్లో తళుకులా మెరిసి..వెంటనే కనుమరుగైపోతుంటారు. అలాంటి హీరోయిన్లకు సంబంధించిన పిక్స్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

కొంతమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాల్లో తళుకులా మెరిసి..వెంటనే కనుమరుగైపోతుంటారు. అలాంటి హీరోయిన్లకు సంబంధించిన పిక్స్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

Abhirami: ‘చెప్పవే చిరుగాలి’ మూవీలోని హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా మారిందో చూడండి..

సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు. అలా వచ్చి.. కొందరు హీరోయిన్లు తక్కువ సమయంలోనే ఎక్కువ అవకాశాలు పొంది.. స్టార్ డమ్ సంపాదిస్తుంటారు. తమదైన నటనతో, అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. ఇది ఇలా ఉంటే కొంతమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాల్లో తళుకులా మెరిసి..వెంటనే కనుమరుగైపోతుంటారు. అయితే వాళ్లు తక్కువ సినిమాలే చేసిన..గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాంటి హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మరి.. ఆ హీరోయిన్ ఎవరు, ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు చూద్దాం…

కేరళ కుట్టి అభిరామి గురించి చాలా మందికి ప్రేక్షకులకు తెలుసు. ముఖ్యంగా తెలుగులో తొట్టెంపూడి వేణుతో కలిసి చెప్పవే చిరుగాలి అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో అభిరామి నటనకు టాలీవుడ్ ఆడియన్స్ ఫుల్ మార్కులేశారు. ఇక ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ సినిమా హిట్ తో మరో రెండు తెలుగు సినిమాల్లో అవకాశం సంపాదించింది. మొత్తంగా తన అందం, నటనతో తక్కువ సినిమాలే చేసిన తెలుగుమ్మాయిలా మారిపోయింది.

ఇక టాలీవుడ్ తో పాటు కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారు.  ఆతరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ఇటీవల అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తుంది. 2018లో రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో కూడా అభిరామి ఓ చిన్న పాత్ర చేసింది. ఆ తరువాత కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ అలా మెరిసి వెళ్లేది. తాజాగా రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న భలే ఉన్నాడే సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ సినిమా కంటే ముందు ఓ కోలీవుడ్ డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అభిరామి పలరించనున్నారు.

విజయ్ సేతుపతి హీరోగా మహారాజా సినిమా జూన్ 14 ప్రేక్షకుల ముందుకు రాబోంది. ఈ సినిమా విజయే సేతుపతికి 50వ సినిమ కావడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తుండటంతో మేకర్స్ హైదరాబాద్ లో ప్రెస్ మెట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో అభిరామి కూడా పాల్గొన్నారు. చాలా ఏళ్ల తరువాత అభిరామి తెలుగులో ప్రెస్ మీట్స్ లో కనిపించారు. చెప్పవే చిరుగాలిలో కనిపించిన అభిరామిని, తాజా ఈవెంట్ లో చూసి.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాలా మారిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాను మళ్లీ తెలుగులో వరుస సినిమాలు చేయడం సంతోషంగా ఉందంటూ అభిరామి చెప్పుకొచ్చింది.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet