iDreamPost

అయోధ్య బాల రాముని విగ్రహంలో మార్పులు.. ప్రాణ ప్రతిష్టకు అంతటి శక్తి ఉందా..?

అయోధ్యలోని రామాలయంలో కొలువు దీరిన బాల రాముడు పూజలు అందుకున్నాడు. జనవరి 22న బాల రాముని ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ప్రాణ ప్రతిష్ట అనంతరం రాముని విగ్రహంలో మార్పులు సంతరించుకున్నాయట.

అయోధ్యలోని రామాలయంలో కొలువు దీరిన బాల రాముడు పూజలు అందుకున్నాడు. జనవరి 22న బాల రాముని ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ప్రాణ ప్రతిష్ట అనంతరం రాముని విగ్రహంలో మార్పులు సంతరించుకున్నాయట.

అయోధ్య బాల రాముని విగ్రహంలో మార్పులు.. ప్రాణ ప్రతిష్టకు అంతటి శక్తి ఉందా..?

ఎన్నో శతాబ్దాల కల తీరింది. అయోధ్యలోని రామాలయంలో బాల రాముడు కొలువు తీరాడు. జనవరి 22న చిన్నారి శ్రీ రాముని ప్రాణప్రతిష్ట అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మొత్తం కార్యక్రమం జరిగింది. అతిరథ మహారధులు ఈ కార్యక్రమానికి హాజరై.. బాలక్ రామ్‌ను చూసి మురిసిపోయారు. భారత్‌లోని ప్రతి హిందువు రాముడి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని టీవీల్లో, ఎల్‌ఇడి స్క్రీన్లలో చూసి పులకించిపోయారు. రాముని నిండైన రూపాన్ని చూసి మురిసిపోయారు. ఇప్పుడు ఆయనను కన్నులారా తిలకించేందుకు అనేక మంది భక్తులు అయోధ్యకు తరలి వెళుతున్నారు.

అయితే ప్రాణ ప్రతిష్ట అనంతరం విగ్రహంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని ఆ విగ్రహాన్ని చెక్కిన అరుణ్ యోగి రాజ్ కూడా చెప్పడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఏమైందంటే.. అరుణ్ యోగి రాజ్ విగ్రహాం చేసినప్పుడు.. అది కేవలం విగ్రహంగా కనిపించింది. ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ట జరిగిందే.. అప్పుడు ఓ అద్భుతమైన శక్తిగా అవతరించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కాస్త గమనించి చూస్తే.. ప్రాణ ప్రతిష్టకు ముందు విగ్రహంలోని కళ్లలో శక్తి కనిపించదు. కానీ ఈ వేడుక అనంతరం ఆ కళ్లలో ఏదో మహత్తు దర్శనమిస్తోంది. అలాగే విగ్రహం ముఖ కవిళికల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నట్లు తాము గమనించామని నెటిజన్లు రెండు ఫోటోలను షేర్ చేస్తున్నారు. దీని బట్టి చూస్తే ప్రాణ ప్రతిష్టకు ఉన్న పవర్ తెలుస్తోంది.

నూతనంగా నిర్మించిన దేవాలయాల్లో ప్రతిష్టాపన చేసే విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేస్తుంటారు. హిందూ ఆచారాల ప్రకారం.. ఇది ఎంతో కీలకం. ప్రాణ ప్రతిష్ట అంటే విగ్రహంలోకి దైవ శక్తిని నెలకొల్పడం. అలా చేస్తేనే.. ఆ విగ్రహం పూజలందుకోవడానికి అర్హమైనదిగా భావిస్తారు. ఈ ప్రాణ ప్రతిష్ట చేయాలంటే అత్యంత నియమ నిబంధనలతో చేయాల్సి ఉంటుంది. పవిత్రమైన నదీ జలాల్లో విగ్రహానికి స్నానమాచరించి.. తెల్లటి వస్త్రంతో తుడిచి, సంప్రదాయ పద్దతిలో అలంకరణ చేసి.. మంత్రోచ్చరణ నడుమ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేపట్టాలి. పూజలు చేసి..హారతి ఇచ్చి ఆ దైవ శక్తిని ఆ విగ్రహంలో నెలకొల్పాలి. అయోధ్య రామాలయం విషయంలో ఇదే జరిగింది.

అరుణ్ యోగి ఈ విగ్రహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చెక్కారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఈ విగ్రహాన్ని తయారు చేశారు శిల్పి అరుణ్. ప్రాణ ప్రతిష్టాపనకు ముందు విగ్రహంగా ఉన్న బాల రాముడిలో ఆ వేడుక తర్వాత మార్పులు సంతరించుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా శిల్పి చెప్పడం విశేషం. చిరు మందహాసంతో.. నీలి కంఠుని ముఖ హావభావాల్లో కూడా కొంత మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు. గర్భాలయంలో కొలువై ఉన్న విగ్రహాన్నిచూసి ఆశ్చర్యపోయానని అన్నారు. తీక్షణంగా గమనించి చూస్తే.. నిజంగా నిండైన రూపం ఇప్పుడు సాక్షాత్కరమిస్తోంది. కళ్లలో ఏదో వెలుగు, మహత్తు కనిపిస్తోంది. మరీ మీరు గమనించినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి