iDreamPost
android-app
ios-app

Chandrika Ravi: తొలి భారతీయ మహిళగా బాలయ్య బ్యూటీ చంద్రికా రవి రేర్ ఫీట్! 

  • Published Jun 05, 2024 | 6:17 PM Updated Updated Jun 05, 2024 | 6:17 PM

'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి' అంటూ ఒకే ఒక్క సాంగ్ తో టాలీవుడ్ ను షేక్ చేసింది చంద్రికా రవి. ఒక్క సాంగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ.. తాజాగా ఓ తొలి భారతీయ మహిళగా ఓ అరుదైన ఘనతను సాధించింది. ఆ వివరాల్లోకి వెళితే..

'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి' అంటూ ఒకే ఒక్క సాంగ్ తో టాలీవుడ్ ను షేక్ చేసింది చంద్రికా రవి. ఒక్క సాంగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ.. తాజాగా ఓ తొలి భారతీయ మహిళగా ఓ అరుదైన ఘనతను సాధించింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jun 05, 2024 | 6:17 PMUpdated Jun 05, 2024 | 6:17 PM
Chandrika Ravi: తొలి భారతీయ మహిళగా బాలయ్య బ్యూటీ చంద్రికా రవి రేర్ ఫీట్! 

చంద్రికా రవి గుర్తుందా? అంత తొందరగా మర్చిపోయే అందం కాదులెండీ ఈ అమ్మడిది. పైగా ‘మా భావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీలో ఈ ఒకే ఒక పాటతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది చంద్రికా రవి. ఇక ఈ ముద్దుగుమ్మ గురించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చంద్రికా రవి అరుదైన ఫీట్ సాధించింది. మరి ఈ బ్యూటీ సాధించిన రేర్ ఫీట్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రికా రవి.. ఆస్ట్రేలియాకు చెందిన ఈ బ్యూటీ ‘మా భావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అన్న ఒకే ఒక్క పాటతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. చంద్రికా రవి పడ్డ కష్టాన్ని, ఆమె స్ఫూర్తినిచ్చే జీవిత కథను తెలుసుకున్న Rukus Avenue Radio వ్యవస్థాపకుడు సమ్మీ చంద్‌ ఆమెకు అరుదైన అవకాశం కల్పించాడు. అమెరికన్ టాక్ షో ‘ది చంద్రికా టాక్ షో’ కు హోస్ట్ గా వ్యవహరించనుంది చంద్రికా. హోస్ట్ గానే కాకుండా ఈ షోకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. తన జీవిత విశేషాలను ఈ షో ద్వారా ప్రేక్షకులతో పంచుకోవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపింది.

యూఎస్ లో అతిపెద్ద రేడియో నెట్ వర్క్ అయిన iHeart Radio..లో ఈ టాక్ షో ప్రసారం కానుంది. ఈ షోకు సంబంధించిన ఎక్కువ పనులను చంద్రికానే దగ్గరుండి మరీ చూసుకుంటోంది. ఇన్నేళ్ల ప్రదర్శనలతో పోలిస్తే.. ఈ టాక్ షో నాకు ప్రత్యేకమైంది.. ఇక ముందు కొత్త చంద్రికను చూస్తారు అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక టాక్ షో ద్వారా అరుదైన ఘనతను ఆమె సొంతం చేసుకుంది. యూఎస్ లో రేడియో షోను హోస్ట్ చేసిన తొలి భారతీయ మహిళగా చంద్రికా రవి రేర్ ఫీట్ ను సాధించింది. ఈ షో భారతీయ కాలమానం ప్రకారం ప్రతీ గురువారం ఉదయం 7:30 గంటలకు ప్రసారం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ప్రతీ శుక్రవారం ఫుల్ ఎపిసోడ్స్‌ ను యూట్యూబ్‌లో రిలీజ్  చేయనున్నారు. మరి ఈ అరుదైన ఘనత సాధించి చంద్రికా రవిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetcup girişgrandpashabet